Begin typing your search above and press return to search.

వారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నా : రీతూవర్మ

By:  Tupaki Desk   |   23 Jun 2020 7:00 AM IST
వారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నా : రీతూవర్మ
X
తెలుగమ్మాయిలు టాలీవుడ్‌ లో ఎక్కువగా ఆఫర్లు దక్కించుకోలేరు. ప్రతిభ ఉన్నా కూడా టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా సెటిల్‌ అవ్వడం కష్టం అనుకుంటున్న సమయంలో రీతూ వర్మ మాత్రం ఆ అభిప్రాయంను చెరిపేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. పెళ్లి చూపులు చిత్రంతో తెలుగు వారికి దగ్గర అయిన రీతూ వర్మ ఆ తర్వాత తమిళం మరియు తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తోంది. తమిళంలో ఈమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కూడా ఈమె మీడియం రేంజ్‌ చిత్రాల్లో నటిస్తుంది.

శర్వానంద్‌ తో కలిసి నటిస్తున్న చిత్రంతో పాటు నాగశౌర్య హీరోగా నటించబోతున్న ఒక చిత్రంలో రీతూ వర్మ నటిస్తోంది. ఇవి కాకుండా మరో మూడు ప్రాజెక్ట్‌ లు కూడా రీతూ వర్మ చేతిలో ఉన్నాయి. మరో వైపు తమిళంలో కూడా ఈమె నటిస్తున్న సినిమాలు షూటింగ్స్‌ మద్యలో ఉన్నాయి. తెలుగు తమిళంలో ఈమె నటిస్తున్న పలు సినిమాలు షూటింగ్స్‌ మద్యలో ఆగిపోయాయి. గత మూడు నెలలుగా షూటింగ్స్‌ లేకపోవడంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది.

తాజాగా ఈమె షూటింగ్స్‌ విషయమై స్పందిస్తూ... ఇప్పటి వరకు నాకు ఎవరి నుండి షూటింగ్‌ కు హాజరు కావాల్సిందిగా కాల్‌ రాలేదు. షూటింగ్స్‌ కు చాలా గ్యాప్‌ రావడంతో నేను కూడా ఎప్పుడెప్పుడు షూటింగ్స్‌ కు హాజరు అవ్వాలా అని ఎదురు చూస్తున్నాను. కాని కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొంత కాలం షూటింగ్స్‌ ప్రారంభించకుంటేనే బెటర్‌ అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కాని షూటింగ్స్‌ కు కాల్‌ వస్తే మాత్రం వెళ్తానంటూ తేల్చి చెప్పింది.