Begin typing your search above and press return to search.

నేను చిల్ అయిపోతాను.. మీరు థ్రిల్ అయిపోతారుః హీరో

By:  Tupaki Desk   |   1 May 2021 12:33 PM IST
నేను చిల్ అయిపోతాను.. మీరు థ్రిల్ అయిపోతారుః హీరో
X
''అల్లు శిరీష్‌..'' పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ నిర్మాత కుమారుడు, స్టార్ హీరో సోదరుడు.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో. అల్లుశిరీష్ సినిమాలు ప్రేక్ష‌కుల‌కు చేర‌డానికి కాస్త టైమ్ ప‌డుతుందేమోగానీ.. ఆయ‌న అప్డేట్స్ మాత్రం వెంట‌నే చేరిపోతుంటాయి. సోష‌ల్ మీడియాలో అంత‌గా యాక్టివ్ గా ఉంటారు మ‌రి!

త‌న కెరీర్ తోపాటు ప‌ర్స‌న్ విష‌యాల‌ను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు శిరీష్‌. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఇందులో ఒక ఫొటో షేర్ చేసిన ఆయ‌న‌.. త‌ను ఎంతో ఇష్ట‌ప‌డే ప్లేస్ ఇదేన‌ని చెప్పారు.

తాను ఎక్కువ‌గా హ్యాంగ్ అవుట్ అయ్యేది మూడు ప్రాంతాల్లో అని చెప్పారు. అందులో ఒక‌టి కాఫీ షాప్ అని తెలిపిన శిరీష్‌.. రెండో బుక్ స్టోర్స్ అని చెప్పారు. ఇక‌, మూడో ప్ర‌దేశం ఏదైనా ఉందంటే.. ఇప్పుడు షేర్ చేసిన ఫొటోలోని చోటు అని వెల్ల‌డించారు. అయితే.. ఆ చోటు ఫారెన్ లోదో.. మ‌రెక్క‌డిదో కాదు. వాళ్ల ఇంట్లోని గార్డెన్ ప్రాంతం! అవును.. ఈ ప్లేస్ లో త‌ను చిల్ అవుతూ ఉంటాడ‌ట‌.

ఇక‌, శిరీష్ సినిమాల గురించి చూస్తే.. త‌న లాస్ట్ మూవీ ఏబీసీడీ. ఈ చిత్రం వ‌చ్చి చాలా కాల‌మైంది. ఆ త‌ర్వాత కొవిడ్ తో మ‌రింత గ్యాప్ వ‌చ్చింది. అయితే.. ప్ర‌స్తుతం బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ తో ఓ సినిమా చేస్తున్నారు శిరీష్‌.