Begin typing your search above and press return to search.

మెంట‌లెక్కించిన ఇల్లీ బేబి లేటెస్ట్ సెల్ఫీ

By:  Tupaki Desk   |   13 Jan 2021 4:28 AM GMT
మెంట‌లెక్కించిన ఇల్లీ బేబి లేటెస్ట్ సెల్ఫీ
X
ఇలియానా డి క్రజ్ వ్య‌క్తిగ‌త వృత్తిగ‌త జీవితంలో డైల‌మా గురించి తెలిసిన‌దే. ఇంత‌కుముందు ప్రియుడు ఆండ్రూ నీబోన్ నుంచి బ్రేక‌ప్ అయ్యాక ఫ్ర‌స్టేష‌న్ లో బాగా బొద్దెక్కింది. ఆ త‌ర్వాత ఆ అధిక‌బ‌రువును త‌గ్గించుకునేందుకు చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. బొద్దుత‌నం వ‌ల్ల బాలీవుడ్ లో ఆఫ‌ర్ల‌ను కోల్పోయి కెరీర్ ప‌రంగా ఖాళీ అయ్యింది. ఆ క్ర‌మంలోనే దీనిపై ఎంతో విచారించిన ఇల్లీ నిరంత‌రం జిమ్ కి అంకిత‌మై.. ఆపై రెగ్యుల‌ర్ గా యోగ మెడిటేష‌న్ సాధ‌న‌తో ఇప్ప‌టికి స‌న్న‌జాజి రూపానికి తిరిగి షిఫ్ట‌య్యింది.

ఇటీవ‌ల ఇలియానా జిమ్ లో శ్ర‌మిస్తున్న ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవ‌న్నీ యూత్ లో వైర‌ల్ అయ్యాయి. ఇలియానా స‌న్న‌జాజి న‌డుముతో పాటు నాభి సొగ‌సుల‌పైనా యువ‌త‌రంలో వాడి వేడిగా చ‌ర్చ సాగింది. జీరో డిగ్రీల నుంచి 360 డిగ్రీల కోణంలో ఇల్లీ సెల్ఫీ ట్రీట్ ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది.

తాజాగా ఇలియానా మ‌రో హాట్ఫీని షేర్ చేసింది. ఈసారి యోగా మ్యాట్ స‌మీపంలో నిలుచుని ఇదిగో ఇలా సెల్ఫీ దిగింది. వైట్ అండ్ వైట్ టాప్ లో దేహ‌శిరుల్ని ఎలివేట్ చేసింది. ``ఫిట్ గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. మామా ఫోర్చుగీస్ బ్రెడ్ ని రెడీ చేసింది`` అంటూ త‌న డైట్ గురించి ఇల్లీ బేబి ప్ర‌స్థావించింది.

రెగ్యుల‌ర్ గా హార్డ్ కోర్ కార్డియోవాస్కులర్ జిమ్మింగ్ .. యోగాతోనే ఈ రూపం సాధ్యం. దీనికోసం ఇల్లీ చాలా క‌మిట్ మెంట్ తో శ్ర‌మించింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇలియానా న‌టిస్తున్న తాజా చిత్రం ది బిగ్ బుల్ త్వ‌ర‌లో రిలీజ్ కి రానుంది. అభిషేక్ బ‌చ్చ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి అజ‌య్ దేవ‌గ‌న్ నిర్మాత‌.