Begin typing your search above and press return to search.

మెగాస్టార్ పక్కన ఫేడ్ అవుట్ హీరోయిన్..?

By:  Tupaki Desk   |   23 Dec 2020 5:00 PM IST
మెగాస్టార్ పక్కన ఫేడ్ అవుట్ హీరోయిన్..?
X
సినిమాల్లోకి రీఎంట్రీ తర్వాత శరవేగంగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తి కాకుండానే.. మరో రెండు సినిమాలను లైన్లో పెట్టారు చిరు. ఇవి రెండూ రీమేకులే. ఒకటి “వేదాళం” కాగా మరొకటి “లూసిఫర్”.

ఈ రెండు చిత్రాల్లో మొదట లూసిఫర్ చేయనున్నాడు చిరు. అయితే.. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో చాలా డిస్కషన్ నడిచింది. పలువురు డైరెక్టర్ల పేర్లు వినిపించి.. చివరకు రీమేక్ స్పెషలిస్టు మోహన్ రాజా చేతిలో పడింది. అయితే.. ఈ చిత్రంలో ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిన స్టార్ హీరోయిన్ ను తీసుకొన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన ఇలియానా. గతంలో ఇండస్ట్రీలో దుమ్ములేపిన ఈ భామ.. క్రమంగా ఫేడ్ అవుట్ అయిపోయింది. మధ్య మధ్యలో ఒకటీ రెండు చిత్రాలు చేసినా.. పెద్దగా వర్కవుట్ కాలేదు. రవితేజ సరసన ఈ అమ్మడు చేసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఇంత కాలం తర్వాత మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.

అయితే.. చిరంజీవి లాంటి హీరోలకు హీరోయిన్లను వెతకడం ఎప్పటికప్పుడు సమస్యగానే మారింది. వారి ముందు ఈతరం హీరోయిన్లు చిన్న పిల్లల్లా ఉంటున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. మరి, ఈ కోణంలో ఏమైనా ఆలోచించి ఇల్లీ బేబిని ఫైనల్ చేశారా? అనేది తెలియదు. ఇది పుకారా? వాస్తవమా? అనేది కూడా తెలియదు. మరి, లూసీఫర్ లో ఇలియానా ఉందో లేదో తెలియడానికి మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.