Begin typing your search above and press return to search.

కొత్త బోయ్ ఫ్రెండ్ ని ప‌రిచ‌యం చేసిన ఇలియానా

By:  Tupaki Desk   |   3 March 2021 8:30 AM GMT
కొత్త బోయ్ ఫ్రెండ్ ని ప‌రిచ‌యం చేసిన ఇలియానా
X
ఆస్ట్రేలియ‌న్ ఫోటోగ్రాఫ‌ర్ కం ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో బ్రేక‌ప్ అయ్యాక ఇలియానా డీప్ గా డిప్రెష‌న్ లోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆ బెంగ‌లో బాగా బొద్దెక్కింది. కాల‌క్ర‌మంలో ఆ రూపంతో అవ‌కాశాలు క‌ష్ట‌మేన‌ని గ్ర‌హించి జిమ్ యోగా అంటూ శ‌రీరాకృతిని పూర్తిగా ట్రిమ్ చేసే ప‌నిలో ప‌డింది.

జిమ్మింగ్ తో పాటు యోగా సెష‌న్స్ నుంచి రెగ్యుల‌ర్ గా ఫోటోలు వీడియోల్ని ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌కు షేర్ చేసింది. అవ‌న్నీ అంత‌ర్జాలంలో సునామీ సృష్టించాయి. ఇప్ప‌టికి ఇల్లీ తిరిగి త‌న మునుప‌టి రూపానికి మారింది.

ఇదే అద‌నుగా మ‌ళ్లీ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ప్ర‌య‌త్నాల్లో స్పీడ్ పెంచింది‌. హిందీలో బిగ్ బుల్ అనే చిత్రంలో న‌టిస్తోంది. త‌న స్నేహితుడు అజ‌య్ దేవ‌గ‌న్ ఈ చిత్రానికి నిర్మాత‌. అభిషేక్ బ‌చ్చ‌న్ క‌థానాయ‌కుడు. అన్న‌ట్టు ఆండ్రూ నుంచి విడిపోయాక ఇలియానా ఒంట‌రిగానే ఉంటోంది క‌దా? ఇదే విష‌యాన్ని ఓ అభిమాని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నించాడు.

అభిమానుల‌తో `ఆస్క్ మీ ఎనీథింగ్` చిట్ చాట్ సెష‌న్ లో నీ బోయ్ ఫ్రెండ్ ఎవ‌రు? న‌చ్చిన‌వాడు ఎవ‌రు? అనే రెండు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. వాటికి ఇల్లీ వెంట‌నే ఆన్స‌ర్ కూడా ఇచ్చేసింది. అత‌డి పేరు చార్లీ.. నా కొత్త ఫ్రెండ్! అంటూ ప‌రిచ‌యం చేసింది. ఇంత‌కీ చార్లీ ఎవ‌రు? అంటే.. తన పెట్ డాగ్. ఆ క్యూట్ ప‌ప్పీ‌ ఫోటోను షేర్ చేసింది. గోవా బ్యూటీలో ఫ‌న్ ఎలిమెంట్ అభిమానుల‌కు పిచ్చిగా న‌చ్చేసింది. అలాగే మీరు అందం కోసం స‌ర్జ‌రీ చేయించుకున్నారా? అన్న ప్ర‌శ్న కూడా ఎదురైంది. అలాంటిదేమీ లేద‌ని సింపుల్ గా ఆన్స‌ర్ చేసింది.

అన్న‌ట్టు దేవుడు చేసిన మ‌నుషులు- అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని లాంటి డిజాస్ట‌ర్ సినిమాల్లో న‌టించిన ఇలియానాకు మ‌ళ్లీ టాలీవుడ్ లో ఆఫ‌ర్ లేదు. మారిన లుక్ చూశాక అయినా.. ఈసారి టాలీవుడ్ లో ఏదైనా మెగా జాక్ పాట్ త‌గ‌ల‌క‌పోతుందా? అన్న‌ది వేచి చూడాలి.