Begin typing your search above and press return to search.

పూరి.. రానా.. బిర్యాని అండ్ ఇలియానా

By:  Tupaki Desk   |   2 Aug 2017 5:14 PM GMT
పూరి.. రానా.. బిర్యాని అండ్ ఇలియానా
X
గోవా సుందరి ఇలియానాకు మరోసారి నవ్వాలో ఏడవాలో తెలవని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మరోసారి ఆమె సినిమా ఒకటి రిలీజై.. దానికి ఎలాంటి టాక్ వచ్చిందో ఆమెకే అర్ధంకావట్లేదు. గత శుక్రవారం విడుదలైన ముబారకన్ సినిమా కేవలం 5 రోజుల్లో 29 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసిందంటే.. ఖచ్చితంగా ఓ 60 నుండి 80 మధ్యలో వసూలు చేసి ఆగిపోతుంది. అంటే సినిమాను హిట్టనాలా? ఫ్లాపనాలా? మనకే కాదు.. ఇలియానకు కూడా తెలియట్లేదట.

ఈ టైములో అమ్మడు ఏంటమ్మా ఇల్లీ వాట్సప్ అంటే.. ఐ యామ్ మిస్సింగ్ హైదరాబాద్ అంటోంది. ''నేను పూర్తిగా పూరి జగన్ తోనూ రానా దగ్గుబాటి తోనూ టచ్ లోనే ఉన్నాను. అలాగే ప్రగతి ఆంటీతో కూడా టచ్ లో ఉన్నా. నాకు హైదరాబాద్ బిరియాని అంటే చాలా ఇష్టం. చాలా మిస్సవుతున్నాను'' అని చెబుతోందీ నడుం సుందరి. నిజానికి దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటి.. పూరి వెంటనే పోకిరిలో టెరిఫిక్ గా చూపించడంతో పెద్ద స్టార్ అయిపోయింది. అలాగే రానా అండ్ పూరి కలసి చేసిన నేను నా రాక్షసి సినిమాలో ఈమెనే హీరోయిన్. ఆ విధంగా రానా అండ్ పూరికి మంచి దోస్తీ అయిపోయిందిలే. పూరి తీసిన దేవుడు చేసిన మనుషులు సినిమాలో కూడా ఇలియానా అదృష్టం పరీక్షించుకుందిలే.

ఇప్పుడు ముబారకన్ సినిమాలో బాలీవుడ్లో ఆడకపోయినా కూడా.. అమ్మడుకి హిందీలో బాద్షాహో అంటూ మరో సినిమా చేతిలో ఉంది. అయితే ఇవన్నీ ఓకె కాని.. తెలుగులో మాత్రం ఎందుకో అమ్మడికి ఎవ్వరూ ఛాన్సులు ఇవ్వట్లేదు. పోన్లే ఇలియానా.. సరదాగా నీ బాయ్‌ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో ఏదన్నా వెకేషన్ కు వెళ్ళిరా.