Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ లో నటించబోతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్...!

By:  Tupaki Desk   |   19 April 2020 4:00 AM IST
వెబ్ సిరీస్ లో నటించబోతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్...!
X
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌ ని ఎంజాయ్ చేసింది ఇలియానా డిసౌజా. దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన గోవా బ్యూటీ ఆ తర్వాత పోకిరి చిత్రంతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారిని సైతం అధికమించి ఇలియానా ఈ ఒక్క చిత్రంతో టాప్ పొజిషన్ కు చేరుకుంది. అప్పట్లో ఈ నడుము సుందరి ఇలియానా అంటే కుర్రకారుకి పిచ్చ క్రేజ్ ఉండేది. టాలీవుడ్‌ లో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. టాలీవుడ్ లో చాలా కాలం పాటు ఇలియానా హవా కొనసాగింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఈ భామ బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు రావడంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా పరిస్థితి అంతా మారిపోయింది. ఆరంభంలో బాగానే ఉన్నా.. పోను పోను ఇలియానాకి బాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులు తిరస్కరించారు. ఇప్పుడు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌కు కాకుండా పోయి రెంటికి చెడ్డ నావలా తయారైంది ఇల్లీ బేబీ పరిస్థితి. దీంతో సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫోటోలు పెట్టినా ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇలియానా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా తన లక్ పరీక్షించుకోబోతోందట.

వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు జనాలందరూ వెబ్ కంటెంట్ వైపు చూస్తున్నారు. సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల పెద్ద పెద్ద ఆర్టిస్టుల నుండి చిన్నవారి దాకా అందరూ వెబ్ సిరీస్ లలో అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గోవా బ్యూటీ ఇలియానా కూడా ఒక వెబ్ సిరీస్ ద్వారా ముందుకు రాబోతుందట. ఫిమేల్ డామినేషన్ ఉండే ఒక లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ కోసం ఇలియానాతో డిస్కషన్స్ జరుగుతున్నాయట. దీని గురించి అధికారిక ప్రకటన రానప్పటికీ ఇలియానా వెబ్ సిరీస్ లో నటించడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కియారా అద్వానీ, సమంత, ప్రియమణి, ఇషా రెబ్బా లాంటి హీరోయిన్స్ వెబ్ సిరీస్ లో అడుగు పెట్టారు. ఈ వెబ్ కంటెంట్ అనేది మన తెలుగు వారికి ఈ మధ్య ఎక్కువ పరిచయమైంది కానీ బాలీవుడ్ లో ఇది ఎప్పటి నుండో ఉన్నదే. ఈ నేపథ్యంలో ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా కూడా అడుగుపెట్టబోతున్నారన్నమాట.