Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఇలియానా స్లిమ్ అయిందోచ్!

By:  Tupaki Desk   |   20 Sept 2019 12:18 PM IST
ఫోటో స్టొరీ: ఇలియానా స్లిమ్ అయిందోచ్!
X
గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ పేరు ఈమధ్య వార్తల్లో ఎక్కువగా వినిపించింది. ఇలియానా తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ అండ్రూ నీబోన్ తో బ్రేక్ చేసుకుందని సభ్యసమాజానికి పరోక్ష సందేశం ఇవ్వడంతో కలకలం చెలరేగింది. ఇక అంతటితో ఆగకుండా బ్రేకప్ వేదాంతాన్ని కూడా కాస్త తన సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా జనాలతో పంచుకుంది. ఫెయిల్యూర్.. బ్రేకప్ లాంటివి ఎవరికి ఎదురైనా కాస్త వైరాగ్యం వస్తుంది. అది సహజమే.

అయితే సాధారణ మానవులకు ఘటికులకు తేడా ఎక్కడ ఉంటుందంటే.. బ్రేకప్ తర్వాత సాధారణ వ్యక్తి బయటకు రాలేక సతమతమైపోతాడు. ప్రపంచానికి దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ ఇలా చేస్తే గోవా బ్యూటీ ఘటికురాలు ఎందుకు అవుతుంది? రివర్స్ లో ఆ బ్రేకప్ ప్రభావం నుండి తప్పించుకునేందుకు తన ఫిట్నెస్ మీద ఫోకస్ చేసినట్టుంది. రీసెంట్ గా ముంబై లోని యమ కాస్ట్లీ ఏరియా అయినా బాంద్రాలో కనిపించింది. ప్రింటెడ్ కలర్స్ ఉన్న స్లీవ్ లెస్ గౌన్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించింది. స్లిమ్ముగా నాజూకుగా కనిపిస్తోంది. అండ్రూ తో ఫోన్ లు.. వాదనలు లేవేమో కానీ జిమ్ము లోని పరికరాలతో కసరత్తులు చేస్తూ మునుపటి షేప్ లోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది.

ఈలెక్కన ఇల్లీ బేబీ త్వరలోనే సినిమాలపై సీరియస్ గా దృష్టి సారిస్తుందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. అలా అని ప్రస్తుతం ఇల్లీ బేబీ చేతిలో ఆఫర్లు లేవనుకునేరు.. కాదు బాబోయ్ కాదు. ఇల్లీ ప్రస్తుతం 'పాగల్ పంటి'.. 'ది రెడ్ బుల్' అనే రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది.