Begin typing your search above and press return to search.

మళ్ళీ మిడిల్ ఫింగర్ చూపించింది

By:  Tupaki Desk   |   18 April 2017 11:06 AM IST
మళ్ళీ మిడిల్ ఫింగర్ చూపించింది
X
తెలుగులో బూతులు చాలా ఛండాలంగా ఉంటాయ్ కానీ.. ఇంగ్లీష్ భాషలో ఓ సౌలభ్యం ఉంటుంది. పైకి చెప్పేందుకు కన్వీనియెంట్ గా ఉండడమే కాదు.. సిగ్నల్స్ ద్వారా కూడా చెప్పాలనుకున్న భావాన్ని చెప్పేయచ్చు. ఇలాంటి వాటిలో మిడిల్ ఫింగర్ చూపించడం కూడా ఒకటి.

అయితే.. మన హీరోయిన్స్ ఇలా మిడిల్ ఫింగర్ చూపించడం అనేది మాత్రం అరుదైన విషయమే. గతంలో ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య 2 మిలియన్లను దాటినప్పుడు ఇలాగే.. రెండు మిడిల్ ఫింగర్స్ ను చూపిస్తూ తన సంతోషాన్ని వెరైటీగా పంచుకుంది. ఇప్పుడు మళ్లీ మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చింది ఇల్లీ. ఈ ఫోటో తీసిన వ్యక్తి.. ఆమె ఆస్ట్రేలియా లవర్ ఆండ్రూ నీబోన్ అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఇలా మిడిల్ ఫింగర్ చూపించడం వెనక మాత్రం.. ఈ సారి బూతు భావమే ఉంది. ఆ విషయాన్ని తనే చెప్పింది ఇలియానా.

'నేను నా జీవితం ఎలా బతకాలో ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినపుడు'.. అంటూ ఓ సీరియస్ స్మైలీని పోస్ట్ చేసి.. ఇదిగో ఇలా సిగ్నల్ ఇస్తుందట ఇలియానా. నా జీవితం నా రూల్స్.. ఇది నా జీవితం.. మీ సొంత రూల్స్ మీరే తయారు చేసుకోండి.. అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మరీ.. ఈ మిడిల్ ఫింగర్ సిగ్నల్ కి అర్ధం ఏంటో నర్మగర్భంగా చెప్పింది గోవా బ్యూటీ ఇల్లీ బేబీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/