Begin typing your search above and press return to search.

53వ రోజు.. ఇంత‌కీ ఎప్పుడు ముగుస్తుంది ఈ య‌జ్ఞం ఇల్లీ?

By:  Tupaki Desk   |   24 Sept 2020 1:07 PM IST
53వ రోజు.. ఇంత‌కీ ఎప్పుడు ముగుస్తుంది ఈ య‌జ్ఞం ఇల్లీ?
X
సినిమాల్లేక ఖాళీగా ఉంటే క‌విత్వ‌మే పుడుతుందా? ఏమో కానీ గోవా బ్యూటీ ఇలియానా వైఖ‌రి చాలా విచిత్రంగానే ఉంది. ప్రతి ఒక్కరూ తమను తాము నంబ‌ర్ వ‌న్ అనే అనుకోవాల‌ని అంటోంది స‌న్న‌జాజి సోయ‌గం ఇలియానా. ప్రాధాన్యత నంబర్ ని ఎవ‌రికి వారు సొంతంగానే ఫిక్స్ చేసుకోవాల‌ట‌. ఆ కోవ‌లో చూస్తే త‌న‌ని తాను ఎప్పుడూ నంబ‌ర్ వ‌న్ అనే అనుకుంటాన‌ని అంది.

ఇలియానా తాజా సోష‌ల్ మీడియా పోస్ట్ లో “మీకు మీరే ప్రాధాన్యత సంఖ్య 1 గా చేసుకోవడం ఎలా? నా అభిమాన కవులలో ఒకరు @ventumonce నాకు చెప్పినట్లుగా.. ‘మీలాగే కవిత్వాన్ని ఆరాధించడం ఎలా? మీరు నడవ‌డిక పద్యం కావాలంటే ఎలా?`` అంటూ పోయెటిగ్గానే స్పందించింది ఇల్లీ బేబీ. “చాలా సార్లు, మీ లోపాలను చూడటం వాటిపై దృష్టి పెట్టడం చాలా సులభం. మీరు దాన్ని పరిష్కరించుకుంటారు. అవ‌స‌రానికి మించి చేస్తారు`` అంటూ ఫిలాస‌ఫీనే మాట్లాడింది.

తన చిన్ననాటి నుంచే త‌న‌ను తాను మ‌లుచుకున్నాన‌ని చెప్పిన ఇలియానా తాజాగా ఇన్ స్టాలో చ‌క్క‌ని చిత్రాన్ని పోస్ట్ చేసింది. వీటిలో ఒక ప్రధాన త్రోబాక్ చిత్రం వైర‌ల్ గానూ మారింది. ఆ ఫోటో సంగ‌తేమో కానీ ఇలియానా లేటెస్ట్ జిమ్మింగ్ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలాన్ని ఓ రేంజులోనే షేక్ చేస్తోంది. ఇటీవ‌ల వ‌రుస‌గా చెమ‌ట‌లు చిందిస్తూ ఇల్లీ జిమ్ చేస్తోంది. నేటితో 53వ రోజు అంటూ తాజా ఫోటోని షేర్ చేసింది. బ్లాక్ ట్రాక్ .. బ్లాక్ ఫ్లోర‌ల్ టాప్ తో ఇల్లీ టాప్ లేపేసింది. ఇక ఇలియానా పూర్తిగా జీరో సైజ్ కి త‌గ్గిపోవ‌డం ఆస‌క్తిక‌రం.

అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన 2019 మల్టీస్టారర్ `పాగ‌ల్ పంతి`లో ఇలియానా డి క్రజ్ చివరిసారిగా తెరపై కనిపించింది. 1992 లో భారతదేశపు అతిపెద్ద సెక్యూరిటీల కుంభకోణం ఆధారంగా అజయ్ దేవ్‌గన్ నిర్మించిన `ది బిగ్ బుల్` లో ఆమె కనిపించనుంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ కూడా నటించారు.