Begin typing your search above and press return to search.

అబ్బాయిలకు సెక్స్ యావే...

By:  Tupaki Desk   |   25 May 2017 3:49 PM IST
అబ్బాయిలకు సెక్స్ యావే...
X
సెలబ్రిటీలు స్టార్లు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు సోషల్ మీడియా మంచి వేదిక అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే.. రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ తమ భావాలను నిరభ్యంతరంగా చాలామంది చెప్పేస్తున్నారు. తాజాగా గోవా బ్యూటీ ఇలియానా అబ్బాయిలు- అమ్మాయిల మధ్య తేడాను వివరిస్తూ.. ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అయిపోతోంది.

'అబ్బాయిలకు ఎప్పుడూ సెక్స్ ధ్యాసే ఉంటుంది. ప్రతీ ఐదు సెకన్లకు ఒకసారి దాని గురించే ఆలోచిస్తుంటారు' అనేసి అబ్బాయిలపై డ్యామేజింగ్ స్టేట్మెంట్ గట్టిగానే ఇచ్చింది. అలాగని అమ్మాయిలను ఏమీ వదిలిపెట్టలేదు కానీ.. వీళ్లకు మల్టిపుల్ థాట్స్ ఉంటాయని అంటోంది ఇలియానా. 'జిమ్ సెంటర్ కి ఎప్పుడెళ్లాలి.. ఫలానా వ్యక్తి నా పోస్ట్ ను ఎందుకు లైక్ చేయలేదు.. నా పెదాలకు ఇంజక్షన్ అవసరమా.. నా పేరుకు ఇంటిపేరు ముందుండాలా వెనకుండలా.. నా ఐ బ్రోస్ ఎలా ఉన్నాయ్.. ఫాస్ట్ గా డ్రింక్ చేస్తున్నానా..' లాంటి అంశాలపై అమ్మాయిలు ఎక్కువగా ఆలోచిస్తుంటారని చెప్పింది ఇల్లీ బేబీ.

ఇలియానా మాటల ప్రకారం అమ్మాయిలు ఎక్కువ క్రేజీగా ఉండడానికి అసలు సిసలు రీజన్.. ఇలా అనేక అంశాలపై ఆలోచించడమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/