Begin typing your search above and press return to search.

అసలు అలా అనలేదంటున్న ఇల్లీ

By:  Tupaki Desk   |   25 April 2017 5:46 PM IST
అసలు అలా అనలేదంటున్న ఇల్లీ
X
మన సినిమా ఇండస్ట్రి లో వస్తున్న న్యూస్ ముఖ్యంగా హీరోయిన్ ప్రేమలు గురించి వాళ్ళ ఆఫైర్ల గురించి ఎన్నో వింటుంటాం. కొన్ని నిజాలు ఉంటాయ్ కొన్ని కల్పితాలు ఉంటాయ్ . ఇవి కొన్నిసార్లు వాళ్ళకి ప్లస్ అవుతాయి మరి కొన్నిసార్లు మైనస్ అవుతాయి. అలానే ఈ మధ్య గోవా బ్యూటి ఇలియానా అదే ఉచ్చు లో చిక్కుకొంది.

ఈ పోకిరి హీరోయిన్ ఇప్పుడు హింది లో అవకాశాలు కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది. మొన్న ఒకసారి ఏదో ఇంటర్యూలో అవకాశాలు కోసం పడకగదికి వెళ్ళాల్సిన అవసరం లేదు.. కాస్టింగ్ కౌచ్ అవసరం లేదు అని కామెంట్ చేసింది. కాకపోతే ఇప్పుడు నేనలేదు అంటోంది. అసలు అలా అనవలసిన అవసరం నాకు లేదు అని కూడా చెప్పింది. నేను ఏ ఇంటర్వ్యూ లో అలా అన్నానని మీరు చెబుతున్నారో.. ఆ టైమ్ లో నేను విదేశాలలో షూటింగ్ లో ఉన్నాను అని తెలిపింది ఈ నడుం బ్యూటి.

చెప్పిన వాటిని మార్చి రాసే వాళ్ళని చూసా కానీ.. ఇలా చెప్పని వాటిని కూడా మా పేరులు తగిలించి ఎందుకు ఇబ్బంది పెడతారు బాసూ అంటూ జర్నలిస్టులపై సెటైర్లు వేస్తోంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో బాద్షాహో. ముబారకన్ సినిమాల్లో నటిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/