Begin typing your search above and press return to search.

ఇలియానా బయటకొస్తే చుట్టుముట్టేశారంతే

By:  Tupaki Desk   |   21 Oct 2017 7:00 PM IST
ఇలియానా బయటకొస్తే చుట్టుముట్టేశారంతే
X
ఈ అభిమానుల బెడద గోవా బ్యూటి ఇలియానాకు అస్సలు తప్పేలా లేదు. దానికితోడు ఈ మధ్యన ఆమె తన కారు పసుపు రంగులో ఉండటం కారణం చేత ఈజీగా అందరూ గుర్తుపట్టేస్తున్నారు. అంతే కాకుండా ఆమె సినిమాల్లో సెమీ న్యూడ్ సీన్లు.. భారీగా లిప్పు లాకులు చేసేయడంతో.. మాస్ లా బాగా పాపులర్ అయిపోయి.. ఇంకా కష్టాలను ఎదుర్కొంటోంది.

అదిగో ఈరోజు ఉదయం ముంబాయ్ లో ఒక చోటికి వచ్చింది ఇలియానా. వెంటనే ఆమె పసుపు రంగు ఆడీ కారును.. అలాగే ఆమెను గుర్తుపట్టేశారు ఆకతాయిలు. పక్కనే ఇలియాన డ్రైవర్ మరియు ఒక అసిస్టెంట్ మాత్రమే ఉండటంతో.. వెంటనే వారు వెంటపడటం స్టార్ట్ చేశారు. కారులోకి వెళ్ళే లోపు ఆమె పక్కనే నడుస్తూ వారికి వారే సెల్ఫీలు క్లిక్ చేసుకోవడం మొదలెట్టారు. హడలిపోయిన ఇలియానా వెంటనే కారులోకి పరిగెత్తి అక్కడి నుండి వెళిపోయింది.

ఏదేమైనా కూడా హీరోయిన్లు పబ్లిక్ ప్లేసులో తిరగాలంటే కాస్త ఇబ్బందికరంగానే మారిందని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియా జనరేషన్ కారణంగా జనాలు ఎవరు ఎక్కడున్నా పసిగట్టేసి ఇలా వెకిలిగా ప్రవర్తిస్తున్నారు.