Begin typing your search above and press return to search.

ఇలియానా మళ్ళీ వస్తోందోచ్

By:  Tupaki Desk   |   19 May 2018 10:31 AM IST
ఇలియానా మళ్ళీ వస్తోందోచ్
X
గోవా నుంచి టాలీవుడ్ కొచ్చి అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ బక్క పల్చని భామ ఇలియానా. వరస హిట్లు... స్టార్ హీరోల పక్కన ఛాన్సులతో ఇల్లీ బేబికి క్రేజ్ ఓ రేంజిలో ఉండేది. అలాంటి టైంలో అమ్మడి చూపు బాలీవుడ్ పై పడింది. అక్కడ ఒకటి రెండు సినిమాల్లో ఛాన్సులొచ్చి ఆమె పెర్ఫార్మెన్స్ బాగుందనే గుర్తింపు వచ్చింది. దాంతో ప్రమోషన్ వచ్చిన పై ఆఫీసర్ లా ఫీలైపోయి సూట్ కేస్ సర్దుకుని ముంబయికి మకాం మార్చేసింది.

తీరా ముంబయికి వెళ్లాక ఇలియానాకు చెప్పుకోదగిన ఆఫర్లేమీ రాలేదు. తరవాత టాలీవుడ్ నుంచి ఒకట్రెండు ఆఫర్లు వచ్చినా సౌత్ కు రావడానికి ఇష్టపడలేదు. ఇన్నాళ్లకు ఈ భామ మెట్టు దిగొచ్చింది. తిరిగి ఓ తెలుగు సినిమా చేయడానికి ఇలియానా ఓకే చెప్పిందని తెలుస్తోంది. రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కే అమర్ అక్బర్ అంటోని సినిమాలో నటించేందుకు ఇలియానా రెడీ అనేసింది. ఇన్నాళ్లుగా ఇంక తెలుగు సినిమాలు చేయనంటూ బెట్టు చేసిన ఈ భామ తిరిగి నటించడానికి భారీ మొత్తం రెమ్యునరేషన్ ఇస్తామనడంతో సరే అనేసిందట.

అదీగాక ఇలియానా ఫ్రెండ్ షిప్ మెయిన్ టెయిన్ చేస్తున్న టాలీవుడ్ హీరోల్లో రవితేజ ఒకడు. అతడి పక్కన హీరోయిన్ ఛాన్సు కావడంతో తొందరగానే మెట్టు దిగొచ్చిందని టాక్. ఇలియానా చివరగా అల్లు అర్జున్ పక్కన జులాయి సినిమాలో తెలుగులో కనిపించింది. అసలు ఈ రోల్ అను ఇమ్మానుయేల్ చేయాల్సి ఉంది. చివరలో ఆ ప్లేస్ లోకి అనూహ్యంగా ఇలియానా ఎంటరయింది.