Begin typing your search above and press return to search.

ఒకరినొకరు వదల్లేకుండా ఉన్నారే

By:  Tupaki Desk   |   24 May 2019 11:44 AM IST
ఒకరినొకరు వదల్లేకుండా ఉన్నారే
X
గోవా బ్యూటీ ఇలియానా డీ క్రజ్ గురించి తెలియనివారిని అసలు తెలుగు సినిమా ప్రేమికులు అని పిలవలేం. ఆ కాలంలోని రామ్ 'దేవదాస్' నుండి ఈ కాలంలోని 'అమర్ అక్బర్ అంటోనీ' వరకూ ఎన్నో హిట్స్ లో.. ఫ్లాప్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ భామ కెరీర్ ప్రస్తుతం గొప్పగా ఏమీ లేదు. బాలీవుడ్ లో 'పాగల్ పంటి' అనే చిత్రంలో మాత్రమే నటిస్తోంది.

ఇల్లీ ప్రొఫెషనల్ లైఫ్ సంగతేమో కానీ పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్కే. అస్ట్రేలియన్ అయిన అండ్రూ నీబోన్ తో చాలా ఏళ్ళ నుంచి స్నేహసంబంధాలను మెయింటెయిన్ చేస్తోంది. అయితే అది ఫ్రెండ్ షిప్ కాదు ఇద్దరికీ ఎప్పుడో పెళ్లైపోయింది.. కాకపోతే బైటకు చెప్పడం లేదంతే అని చెవులు కొరుక్కునేవారు కూడా లేకపోలేదు. ఈ అంతర్జాలపు అమ్మలక్కల గుసగుసలను నిజమేనా అనిపించే రీతిలో ఒక్కోసారి ఆ జంట ప్రవర్తిస్తుంది. ఒకసారి ఎప్పుడో అండ్రూను ఉద్దేశించి 'హబ్బీ' అనే పదం వాడింది. ఇక తాజాగా అండ్రూ ఆస్ట్రేలియా కు వెళ్తుంటే వీడ్కోలు ఇచ్చేందుకు ముంబై ఎయిర్ పోర్ట్ కు వచ్చింది. వీడ్కోలు భారంగా అనిపించిందో ఏమో గట్టిగా హగ్ చేసుకుంది. ఎన్ని రోజులకు మళ్ళీ కలుస్తారో ఏమో కానీ.. ఆ ఎడబాటు గురించి ఆలోచించి ఎమోషనల్ అయినట్టుంది.. ఆ ఎమోషన్ కాస్తా ఘాటు లిప్ లాకుగా మారింది.

గాఢమైన ఆలింగనాలు.. పెదవి ముద్దులు.. ఇవే కదా ప్రెజెంట్ ట్రెండ్? దీంతో ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇద్దరూ మిస్టర్ & మిసెస్ అవునో కాదో దేవుడెరుగు.. ఆ లిప్ లాకుల్లో ఎమోషన్ చూస్తుంటే త్వరలో తమ బంధం గురించి అధికారికంగా ఏదో ఒకటి ప్రకటించేలా ఉన్నారని అంటున్నారు. ప్రియాంక అమెరికా కోడలైతే ఇల్లీ బేబీ ఆస్ట్రేలియా కోడలు అవుతుంది. తప్పేముంది చెప్పండి!