Begin typing your search above and press return to search.

కావాల్సింది ప్రేమే... ఇలియానా

By:  Tupaki Desk   |   23 Sep 2017 9:15 AM GMT
కావాల్సింది ప్రేమే... ఇలియానా
X
నాజూకు సుందరి ఇలియానాకు ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రేమమయంగా కనిపిస్తోంది. మనకు ఎప్పటికి కావాల్సింది ప్రేమేనని చెబుతోంది. గోవా నుంచి టాలీవుడ్ వచ్చిన ఇలియానా కొద్ది సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోవాలన్న కోరికతో జులాయి తర్వాత ఇక్కడ జెండా పీకేసింది. అక్కడ ఛాన్సులు బాగానే వస్తున్నా.. ఆమె కోరుకున్న స్థాయి గుర్తింపు మాత్రం రావడం లేదు.

ఇలియానా చాలా రోజులుగా ఫిజీకీ చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేస్తోంది. అతడితో తాను పీకల్లోతు ప్రేమలో పడిపోయానని ఈ భామ ఇప్పుడు చెప్పకనే చెబుతోంది. ప్రియుడితో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో ఈమధ్య షేర్ చేసింది. సముద్రపు ఒడ్డున పాత సినిమా హీరోహీరోయిన్ల స్టయిల్ లో వీరు తీసుకున్న ఫొటో చూస్తుంటే వారిద్దరి మధ్య ఎంతటి ప్రేమ ఉందో తెలిసిపోతుంది. ప్రేమే జీవితం అన్న అర్ధంలో ఈ ఫొటోకు ఇలియానా ‘లవ్ ఈజ్ ఆల్ యూ బ్లడీ నీడ్’’ కవితాత్మకంగా క్యాప్షన్ కూడా పెట్టింది.

మిలన్ లూథ్రియా దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘బాద్షాహో’ సినిమాలో ఇలియానా మహారాణి గా కనిపించింది. బాలీవుడ్ లో తొలిసారి ఆమె పాత్రకు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. బాద్షాహో సినిమా తర్వాత ఇలియానా మరోసారి అజయ్ దేవగన్ పక్కన హీరోయిన్ గా కనిపించనుంది. రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్ లో రెయిడ్ సినిమాలో ఈ జంట మరోసారి కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.