Begin typing your search above and press return to search.

ఇలియానాలో ఏదో మిస్సింగ్‌

By:  Tupaki Desk   |   4 Aug 2015 4:53 AM IST
ఇలియానాలో ఏదో మిస్సింగ్‌
X
ఇల్లియానా .. చిల్లియానా అంటూ వర్ణించాడో కవి. టాలీవుడ్‌ని దశాబ్ధం పైగానే ఏలిన ఈ సోయగం ఇటీవలి కాలంలో సౌత్‌ ని కాదనుకుని ముంబై వెళ్లిపోయింది. ఉత్తరాది సినిమాని ఏలేయాలని కలలుగంది. అనుకున్నట్టే ప్రయత్నం ఫలించి తొలి అడుగులు బాగానే పడ్డాయి కానీ, కెరీర్‌ పరంగా ఆశించినంత స్పీడ్‌ గా ఎదగలేకపోయింది. ఇటీవలి కాలంలో నటించిన సినిమాలన్నీ అట్టర్‌ ఫ్లాపులై పెనుసవాల్‌ విసిరాయి. ఈ అమ్మడికి ఎటూ తోచని పరిస్థితిని తెచ్చిపెట్టాయి.

సక్సెస్‌ తో గ్లో వస్తుంది. ఫెయిల్యూర్‌ తో నీరసం ఆవహిస్తుంది. ఇదిగో ఇటీవలే ముంబై లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానా మరీ చిక్కి శల్యమై, పాలిపోయి ఎంతో నీరసంగా కనిపించింది. సక్సెస్‌ రాలేదని బెంగ పెట్టుకుందో, కెరీర్‌ ఏమవుతుందోనన్న భయం వల్లనో ఇలా అయిపోయింది. డిజైనర్‌ టాప్‌, మిడ్డీతో కాస్త ట్రెండీగా కనిపించినా ఏదో లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఈ భామలో. ఇలియానాలో మునుపటి ఛార్మ్‌ కనిపించడం లేదు. అదంతా ఇలా తెలిసిపోతోందన్నమాట!