Begin typing your search above and press return to search.

అతగాడితో ఇల్లీ నైట్ అవుట్ సూపరట

By:  Tupaki Desk   |   21 Aug 2016 3:00 PM IST
అతగాడితో ఇల్లీ నైట్ అవుట్ సూపరట
X
హాటీ ఇలియానా ఎప్పుడు చూసినా కూడా సంచలనాత్మక కామెంట్లు చేస్తూ నానా రచ్చ చేస్తుంటుంది. గతంలో ఎలాగైతే ఇంటికి రాగానే బ్రా హుక్ తీసేసి విసిరేసి మంచం మీద పడిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో.. అని చెప్పినట్లు ఇప్పడు కొత్తగా అమ్మడు తన నైట్ అవుట్స్ గురించి కామెంట్లు చేస్తోంది.

గత రాత్రంతా అమ్మడు తన బాయ్‌ ఫ్రెండ్ ఆండ్రీ నీబోన్ తో కలసి సందడి చేసిందట. మరీ పబ్బులకు పార్టీలకు వెళ్లిందో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిందో తెలియదు కాని.. హ్యాపీగా ఎంజాయ్ చేశాను.. ఇలాంటి రాత్రుళ్లు అసలు టైమే తెలియదు.. నాకిష్టమైన వ్యక్తితో నైట్ అవుట్.. అంటూ సెలవిచ్చింది ఈ గోవా బ్యూటి. ఇకపోతే ఎప్పుడూ ఇలాంటి విషయాలు షేర్ చేసినప్పుడు ఏదో ఒక హాట్ ఫోటో కూడా షేర్ చేస్తూ ఉంటుంది. కాని ఈసారి మాత్రం కేవలం ఒక సింపుల్ ఫోటోను మాత్రమే షేర్ చేసింది.

మరో ప్రక్కన చూసుకుంటే.. ఇలియానా ఈ మధ్యనే పప్పులో కాదు ఏకంగా సునామీలో కాలేసిందని చెప్పొచ్చు. రుస్తుం సినిమా తరువాత అమ్మడుకి ఆంఖేన్ సీక్వెల్ లో నటించే ఛాన్సొస్తే.. అసలు నేను ఓకె చెప్పకుండా సినిమాలో నేను చేస్తున్నట్లు నా పేరు ప్రకటించారు.. నేను కోర్టుకెళతా అంటూ కామెంట్లు చేసింది. నిజానికి ఈ అమ్మడికి ఉన్న ఫేం కి.. అసలు ఆఫర్ రావడమే ఎక్కువ అనుకుంటే.. మళ్ళీ ఈ వేషాలొకటి అంటూ బాలీవుడ్ ఇప్పుడు నవ్విపోస్తోంది.