Begin typing your search above and press return to search.

అక్కడ ఇక్కడ అన్నిదారులు మూసుకుపోయాయా?

By:  Tupaki Desk   |   29 Jan 2020 5:02 PM IST
అక్కడ ఇక్కడ అన్నిదారులు మూసుకుపోయాయా?
X
సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇలియానా బాలీవుడ్‌ లో ఆఫర్లు రావడంతో అక్కడకు వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడ రెండు మూడు సంవత్సరాలు బిజీగా గడిపిన ఇలియానా ఆ తర్వాత ఖాళీ అయ్యింది. రెండు సంవత్సరాల పాటు ఎలాంటి ప్రాజెక్ట్‌ లేకుండానే ఆమె నెట్టుకు వస్తుంది. ఇదే సమయంలో సౌత్‌ లో కూడా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసింది. తెలుగులో చేసిన ఒక్క సినిమా అమర్‌ అక్బర్‌ ఆంటోనీ కూడా నిరాశ పర్చింది.

ప్రస్తుతం అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ప్రయత్నాలు చేస్తుంది. తెలుగులో అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమాలో లావుగా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. దాంతో లావు కూడా తగ్గిందట. అయినా కూడా ఈమెను పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దాంతో ఈ అమ్మడు ఇతర దారులను వెదుక్కుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ లకు మంచి డిమాండ్‌ ఉన్న కారణంగా వాటిని చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

ఒక దర్శకుడు ఈమెను థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ తో వెబ్‌ సిరీస్‌ చేయబోతున్నట్లుగా సంప్రదించాడట. సినిమాల్లో ఎలాగూ అవకాశాలు లేవు కనుక వెబ్‌ సిరీస్‌ ల్లో నటించి మళ్లీ సినిమాల్లో ఏమైనా ఛాన్స్‌ దక్కేనా చూడాలంటూ ఆమె ఎదురు చూస్తుంది. మొత్తానికి తెలుగు మరియు హిందీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఈమెకు అన్ని దారులు మూసుకు పోయినట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.