Begin typing your search above and press return to search.

ఫిజీ నుంచి వ‌చ్చాకేగా ఆండ్రూతో బ్రేక‌ప్ అయ్యింది?

By:  Tupaki Desk   |   8 Oct 2020 11:45 AM IST
ఫిజీ నుంచి వ‌చ్చాకేగా ఆండ్రూతో బ్రేక‌ప్ అయ్యింది?
X
మాజీ బోయ్ ఫ్రెండ్ తో ఒంట‌రి దీవి జ్ఞాప‌కాలు వ‌ద‌ల‌వా ఇల్లీ బేబీ? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.. ఈ భామ షేర్ చేసిన త్రోబ్యాక్ ఫోటోలు చూశాక‌. అప్ప‌ట్లో ఫిజీ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగిన ఇలియానా ఆ దీవుల్లో విర‌విహారం చేసింది. అక్క‌డ ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో క‌లిసి ర‌క‌ర‌కాల ఫోటోషూట్ల‌లో పాల్గొంది. స్వ‌త‌హాగానే ఆండ్రూ ఫోటోగ్రాఫ‌ర్ కాబ‌ట్టి ఇల్లీ ప‌ని చాలా సులువు అయిపోయింది.

ఫిజీ దీవుల నుంచి చాలా ఫోటోల్ని ఇప్ప‌టికే ఇలియానా అంత‌ర్జాలంలో అభిమానుల కోసం షేర్ చేసింది. అవ‌న్నీ వైర‌ల్ గా దూసుకెళ్లిపోయాయి. ఇక బికినీ బీచ్ లో ఇలియానా టూపీస్ స్టంట్స్ వేడెక్కించాయి అప్ప‌ట్లో. ఇదిగో ఈ సిరీస్ లో కొన్ని త్రోబ్యాక్ ఫోటోల్ని రివీల్ చేస్తోంది తాజాగా. లేటెస్ట్ ఫోటో జెట్ స్పీడ్ తో నెటిజ‌నుల్లోకి దూసుకొచ్చేసింది.

ఇలియానా డి క్రజ్ ఇన్ ‌స్టాగ్రామ్ పోస్ట్ లో తనను తాను ``ఒంట‌రి దీవి అమ్మాయి జీవితం`` అంటూ అభివర్ణించింది. ఫిజీ ఫోటోషూట్ స్నాప్స్ లో ఇలియానా నీలిరంగు ఈత కొల‌ను దుస్తులను ధరించింది. టేక్ మి బ్యాక్ .. బీచ్ బ‌మ్!`` అంటూ అప్ప‌టి జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోయింది. ఇలియానా పోస్ట్ కి కొద్ది నిమిషాల్లో గుండెలు మండుతున్న ఫైర్ ఎమోజీలతో రిప్ల‌య్ లు అదిరిపోయాయి.

వాటర్ బేబీ ఇలియానా డి క్రజ్ తరచూ బీచ్ నుండి ఇలాంటి వేడెక్కించే ఫోటోల్ని పంచుకుంటుంది. ఇన్ ‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చాలా అందంగా క‌నిపిస్తోంది. ఇక‌పోతే ఫిజీ టూర్ త‌ర్వాత ఇలియాన త‌న ప్రియుడి నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే డిప్రెష‌న్ లోకి వెళ్లి బాగా బ‌రువు పెరిగింది. ఇటీవ‌ల ఆ బ‌రువును త‌గ్గించేందుకు శ‌త‌విధాలా శ్ర‌మిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేస్తోంది.

కెరీర్ సంగ‌తి చూస్తే.. 2019 కామెడీ చిత్రం `పాగ‌ల్ పంతి` కనిపించింది. ఇందులో అనిల్ కపూర్ - జాన్ అబ్రహం- ఊర్వశి రౌతేలా- కృతి ఖర్బండా కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ చిత్రాలలో బ‌ర్ఫీ !- ఫాటా పోస్టర్ నిక్లా హీరో- రుస్తోమ్ - హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాల్లో నటనకు పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం అభిషేక్ బచ్చ‌న్ తో క‌లిసి `ది బిగ్ బుల్` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత కూకీ గులాటి దర్శకత్వం వహించారు. అజయ్ దేవ్‌గన్ నిర్మించారు. OTT ప్లాట్‌ఫాం డిస్నీ + హాట్ ‌స్టార్ ‌లో విడుదలయ్యే ఏడు పెద్ద బాలీవుడ్ చిత్రాలలో బిగ్ బుల్ ఒకటిగా ప్రకటించారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.