Begin typing your search above and press return to search.

ఇల్లీ బేబీ వచ్చేసింది

By:  Tupaki Desk   |   21 Jun 2018 3:24 PM IST
ఇల్లీ బేబీ వచ్చేసింది
X
గోవా నుంచి టాలీవుడ్ కు వచ్చిన బక్కపలచని భామ ఇలియానా తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. న్యూ జనరేషన్ హీరోలందరితోనూ ఇలియానా జతకట్టింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉండగానే బాలీవుడ్ పై ఆమెకు గాలి మళ్లింది. రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన బర్ఫీ సినిమా హిట్టవడంతో టాలీవుడ్ ప్యాకప్ చెప్పేసి ముంబయి ఫ్లైటెక్కి బాలీవుడ్ చెక్కేసింది.

బాలీవుడ్ లో ఇల్లీ బేబికి ఎన్నాళ్లు వెయిట్ చేసినా సరయిన బ్రేక్ రాలేదు. అప్పుడొకటి.. అప్పుడొకటిగా ఆఫర్లయితే వచ్చాయి కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ రాలేదు. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాపర్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూస్ తో ఫారిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మంచి అవకాశం చూసుకుని టాలీవుడ్ కు తిరిగి రావాలని చూస్తోంది. ఎట్టకేలకు రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. తాజాగా ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. త్వరలో ఈ చిత్ర యూనిట్ బయలుదేరి వెళ్లనుంది.

ఇంతకుముందు ఇలియానాకు టాలీవుడ్ నుంచి ఆఫర్లొచ్చినా కళ్లు తిరిగే మొత్తం రెమ్యునరేషన్ అడిగి అందరినీ బెదరగొట్టి వెనక్కి పంపేసింది. ఇప్పుడు చేతిలో సినిమాలు ఏమీ లేకపోవడం.. ఈ నిర్మాతలు బాగానే ముట్టజెప్పడంతో తిరిగి తెలుగు తెరపై కనిపించడానికి ఓకే అనేసింది.