Begin typing your search above and press return to search.

ఆ హీరో పుణ్యంతో మ‌ళ్లీ డ్యూటీ ఎక్కుతున్న‌ ఇలియానా!

By:  Tupaki Desk   |   31 Jan 2022 12:30 PM GMT
ఆ హీరో పుణ్యంతో మ‌ళ్లీ డ్యూటీ ఎక్కుతున్న‌ ఇలియానా!
X
ఇలియానా.. ఈ గోవా అందం గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో వ‌చ్చిన‌ `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఇలియానా.. ఫ‌స్ట్ మూవీతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత పోకిరితో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని స్ట‌ర్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న ఈ బ్యూటీ.. ఇక వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ అన‌తి కాలంలో టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే, ఇక్క‌డ కెరీర్ స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతున్న స‌మ‌యంలోనే ఇలియానా బాలీవుడ్‌కు మ‌ఖాం మార్చేసింది. కానీ, అక్క‌డ ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు ల‌భించ‌లేదు. దాంతో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో కొన్నాళ్లు ప్రేమాయ‌ణం న‌డిపిన ఇలియానా.. కొద్ది రోజుల క్రితం అత‌డికి బ్రేక‌ప్ చెప్పేసింది.

ప్ర‌స్తుతం ఒంట‌రిగానే ఉంటున్న ఈ ముదురు ముద్దుగుమ్మ మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ, ఇక్క‌డి ద‌ర్శ‌క‌నిర్మాత‌లెవ్వ‌రూ ఆమెను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇలాంటి త‌రుణంలో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ పుణ్య‌మా అని మ‌ళ్లీ ఇలియానా డ్యూటీ ఎక్క‌బోతోంది.

ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో అదిరిపోయే ఓ ఐటెం సాంగ్ ఉంటుంద‌ట‌. అయితే ఆ సాంగ్ కోసం ర‌వితేజ ఇలియానాను రికమెండ్‌ చేశాడ‌ట‌. దాంతో మేక‌ర్స్ ఇలియానాను సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌కే ఓకే చెప్పింద‌ని, త్వ‌ర‌లోనే ఈ సాంగ్ షూట్ స్టార్ట్ కానుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.