Begin typing your search above and press return to search.

మళ్లీ టూపీస్ బొమ్మ చూపించిందిగా

By:  Tupaki Desk   |   5 July 2016 7:14 PM IST
మళ్లీ టూపీస్ బొమ్మ చూపించిందిగా
X
నాకు బీచ్ లంటే మహా పిచ్చి అంటూ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. సోషల్ మీడియాలో మహా యాక్టివ్ గా ఉండే ఈ బక్క భామ.. ఈ మధ్య తెగ ఫోటోలు షేర్ చేసేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో వరుసగా తన ఫోటోలను పెట్టేస్తూ.. నెటిజన్లకు మంచి కిక్ ఇస్తోంది. అన్ని ఫోటోలు ఈ సుందరాంగి అందాలను బయటపెట్టేవే కావడమే అసలు విశేషం.

ఇప్పుడీ బీచ్ బ్యూటీ ఓ కొత్త ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఏవో రెండు పీలికల్లాంటి టూ పీస్ లను కట్టేసుకుని.. అందాలను ప్రదర్శనకు పెట్టేసింది. సైడ్ యాంగిల్ లో తీసిన ఈ ఫోటోలో.. అమ్మడి నడుం ఒంపుల నుంచి చూసినోళ్లకు చూసినన్ని అందాలు కనిపిస్తాయి. ఇంతగా తనలోని బ్యూటీని బయటకు తీస్తున్నది ఎవరో కాదు. ఆమె ప్రియుడు అండ్రూ నీబోన్. వృత్తి పరంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిన ఇతగాడు.. ఇల్లీ అందాలను వెతికి వెతికి మరీ కొత్త కొత్త యాంగిల్స్ లో అభిమానులకు చూపిస్తున్నాడు. తన బోల్డ్ ఫోటోను షేర్ చేసి.. ఇతగాడి ఫోటోగ్రఫీ ట్యాలెంట్ ను పొగుడుతోంది ఇలియానా.

'ఫిల్టర్లు లేవు.. ఫోటో షాప్ లేదు.. ఎలాంటి బుల్షిట్ లేదు.. అదీ అండ్రూ ఫోటోల స్పెషాలిటీ' అంటూ ఓ పోస్ట్ కూడా పెట్టింది ఇల్లీ బేబి. ఈ గోవా బ్యూటీ అందాలను అండ్రూ ఆరాధిస్తూ.. కెమేరాలో బంధిస్తుంటే... వాటన్నిటినీ ఎంచక్కా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసి.. కనుల విందు చేసేస్తోంది ఇలియానా.