Begin typing your search above and press return to search.

ఇలియానా.. ఎక్కడ చూసినా ఇదే పేరు

By:  Tupaki Desk   |   21 Jun 2017 2:35 PM IST
ఇలియానా.. ఎక్కడ చూసినా ఇదే పేరు
X
గత ఏడాది ఈ సమయానికి ఇలియానా పరిస్థితి దయనీయంగా ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ కెరీర్ ఆశాజనకంగా లేదు. అవకాశాల్లేక ఏడాది పైగా ఖాళీగా ఉండిపోయింది. నమ్ముకున్న సినిమాలు నట్టేట ముంచేశాయి. కానీ ఏడాది తిరిగేసరికి బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది ఇల్లీ బేబీ. పోయినేడాది ‘రుస్తుమ్’ సినిమాతో మాంచి హిట్టును ఖాతాలో వేసుకున్న గోవా బ్యూటీ.. ఆ ఊపులో ఒకటికి రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు పట్టేసింది. ఆ సినిమాలే.. ముబారకన్.. బాద్షాహో. ఈ రెండు సినిమాల టీజర్.. ట్రైలర్ ఒకే రోజు విడుదలై ఇలియానా పేరు మార్మోగిపోయేలా చేస్తున్నాయి.

నిన్న ఉదయం వచ్చిన ‘బాద్షాహో’ టీజర్ ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎమర్జన్సీ రోజుల్లో ప్రభుత్వ ఖజానాతో ప్రయాణిస్తున్న ఓ వాహనం మీద ఆరుగురు దాడి చేసి ఆ సొమ్మును కొల్లగొట్టేందుకు చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఐతే ట్రైలర్లో కంటెంట్ కంటే కూడా ఇలియానా బ్యాక్ లెస్ పోజులు.. అజయ్ దేవగణ్ తో రొమాన్సే బాగా హైలైట్ అయ్యాయి. కుర్రాళ్లు ఇల్లీ రొమాన్స్ కోసం ఆవురావురుమని ఎదురు చూసేలా ఉన్నాయి ఆ షాట్స్. మరోవైపు ‘ముబారకన్’ సినిమా ట్రైలర్లోనూ ఇలియానా చాలా సెక్సీగా కనిపించింది. ఇది శంకర్ మూవీ ‘జీన్స్’ స్ఫూర్తితో తెరకెక్కిన సినిమాలా కనిపిస్తోంది. ఇలియానా గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అయ్యేలా ఉంది. ఈ సినిమాలో ఆథియా శెట్టి మరో కథానాయికగా కనటిస్తుండగా.. ట్రైలర్లో ఆమెను పూర్తిగా డామినేట్ చేసింది ఇలియానా. మొత్తానికి ఒకే రోజు ఒక టీజర్.. ట్రైలర్లో హైలైట్ అయిన ఇలియానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ‘ముబారకన్’ జులై 28న.. ‘బాద్షాహో’ సెప్టెంబరు 1న విడుదల కాబోతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/