Begin typing your search above and press return to search.

ఆ న్యూడ్ సీనేంటో ఊరిస్తున్నారయ్యా

By:  Tupaki Desk   |   8 Aug 2017 1:08 PM GMT
ఆ న్యూడ్ సీనేంటో ఊరిస్తున్నారయ్యా
X
మొన్న టీజర్లో న్యూడ్ సీన్ చూపెట్టారు. తరువాత ఒక పాటలో దాని హింట్ మళ్ళీ ఇచ్చారు. ఇప్పుడు ట్రైలర్లో కూడా అలా రెప్పేస్తే ఇలా మిస్సయ్యే తరహాలో న్యూడ్ బిట్ చూపించేశారు. ఈ న్యూడ్ సీనేంటో తెలియదు కాని.. దానికి సెన్సారోళ్ళు ఎంతవరకు ఓకె అన్నారో అర్ధంకావట్లేదు కాని.. దీని వలన గోవా నడుం సుందరి ఇలియానాకు మాత్రం చాలా పేరొచ్చేస్తోంది. గతంలో మ్యాగజైన్లపై సెమీ న్యూడ్ బికినీ వేషాలు వేసినప్పుడు కూడా రాని పేరు ఇప్పుడు వస్తోంది.

త్వరలో విడుదల కానున్న బాద్షాహో సినిమాలో ఇలియానా పూర్తి స్థాయిలో బ్యాక్ లెస్ లుక్కులో కనిపించనున్న సంగతి తెలిసిందే. తొలి టీజర్లోనే ఇలియాన పైన వేసుకున్న కోటును తీసేస్తే అజయ్ దేవగన్ ను పెదాలతో పెనవేసే సీన్ ఒకటి చేసినట్లు చూపించారు. తరువాత పాటల్లో ఇప్పుడు ట్రైలర్లో కూడా దీనికి సంబంధించిన షాట్ ఒకటి పెట్టి నానా రచ్చ చేస్తున్నారు ఆ సినిమా మేకర్లు. మన సౌత్ ప్రేక్షకులకు ఈ టీజర్ మరియు ట్రైలర్ లోని ఇతర అంశాల అన్నింటికంటే కూడా ఎందుకో ఇలియానా న్యూడ్ సీనే తెగ నచ్చేస్తోంది. మరి అంతా ఊరిస్తున్న ఈ సీన్ అసలు సినిమాలో ఉంటుందా.. సెన్సార్ ఒప్పుకుంటుందా అనేదే ఇప్పుడు ప్రశ్న.

ఇకపోతే సినిమాలేవీ లేనప్పుడు ఇలియానా ఎట్రాక్ట్ చేయడానికి ఇటువంటి ఫీట్లను చేస్తోందని అంటున్నారు బాలీవుడ్ పెద్దలు. చూస్తుంటే మనకు కూడా అలాగే అనిపిస్తోంది కాని.. అసలు సౌత్ లో సినిమాలు చేసుకుంటే ఎంత బాగుంటుంది ఇలియానా అంటూ మనోళ్ళు జాలిపడుతున్నారు. అది సంగతి.