Begin typing your search above and press return to search.

ఇలియానా చేతిని కోసిందెవరు? అదంతా పబ్లిసిటీ స్టంటేనా!

By:  Tupaki Desk   |   10 Nov 2020 12:50 PM GMT
ఇలియానా చేతిని కోసిందెవరు?  అదంతా పబ్లిసిటీ స్టంటేనా!
X
ఒకప్పుడు తెలుగులో స్టార్​హీరోయిన్​గా వెలిగిన గోవా బ్యటీ ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి వెనకబడిపోయింది. టాలీవుడ్​లో అందాలను ఆరబోసి తెలుగు ప్రజలను ఫిదా చేసిన ఈ అమ్మడు బాలీవుడ్​లో మాత్రం పోటీని తట్టుకోలేకపోయింది. తెలుగులో యువహీరోలందరితోనూ నటించింది. ఇటీవల మళ్లీ టాలీవుడ్​లో రీ ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ సాధించలేక పోయింది. కాగా సోషల్​మీడియాలో మాత్రం ఆమెకు చాలామంది ఫాలోవర్స్​ ఉన్నారు. ఇలియానా కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ గోవాబ్యూటీ పెట్టిన ఓ పోస్ట్ చేసిన ఫోటో అభిమానులను కంగారు పెట్టింది. ఇలియానా ప్ర‌స్తుతం బ‌ల్వీంద‌ర్ సింగ్ జ‌నుజ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్‌దీప్ హుడాతో కలిసి ‘అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్‌లీ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్ర షూటింగ్​లో ఇలియానా చేతికి గాయం అయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన చేతి ఫోటోను షేర్ చేసింది. దీని ఫన్నీ గా కామెంట్ పెట్టింది. ‘రొమాంటిక్ కామెడీ సినిమా కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరు గాయపడతారు?’ అంటూ చమత్కరించింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఇటువంటి ప్రమోషన్లు చేసుకుంటున్నదని కొందరు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే బాలకృష్ణ కొత్త సినిమాలో ఇలియానా నటిస్తుందన్న వార్తలు వచ్చినప్పటికీ అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ బయటకు రాలేదు.