Begin typing your search above and press return to search.

ఇలియానా డ్రస్సులో ఏదో తేడా కొట్టిందే

By:  Tupaki Desk   |   9 Jun 2016 9:00 PM IST
ఇలియానా డ్రస్సులో ఏదో తేడా కొట్టిందే
X
మొన్ననే చెప్పిందిగా.. తనకు కమర్షియల్‌ సినిమాల్లో గ్లామరసం వలకపోస్తూ కనిపించడం అంటే మహా చెడ్డ చిరాకు అని. అయినాసరే అమ్మడు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పిచ్చ పిచ్చ సెక్సీగా దర్శనం ఇచ్చేస్తోంది. అదిగో నిన్న ముంబయ్‌ లో జరిగిన ఒక చారిటీ ఈవెంట్ కోసం అమ్మడు వచ్చిన తీరు చూస్తే ఎవరికైనా షాక్ తగలక మానదు.

మామూలుగా షర్టు వేసుకొచ్చిన ఇలియానా.. ఈవెంటుకు రాగానే షర్టు విప్పేసింది. అంతే కాదు.. లోపల వేసుకున్న ఒక పింక్ బ్రా.. దానిపై వేసుకున్న స్పోర్ట్స్ బ్రా.. దానిపై వేసుకున్న ఒక సింపుల్ టాప్‌.. ఇవన్నీ కనిపించేలా నానా రచ్చా చేసింది. కావాలనే అంతలేసి ఎక్సపోజింగ్‌ చేస్తోందని వేరే చెప్పక్కర్లేదు. అయితే ఇలియానా మాత్రం.. ఇదంతా ఒక ఫ్యాషన్ అన్నట్లుగా స్టేట్మెంట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అలా అనుకున్నా కూడా డ్రస్సులో ఏదో తేడా కొట్టిందని మనం అనుకోక తప్పదు మరి.

ఒక్కోసారి అంతే బేబి.. ఎంత ప్రయత్నించినా కూడా సినిమా దర్శకనిర్మాతలు కనికరించరు. సో.. షర్టు విప్పినా విప్పకపోయినా ఫేట్‌ పెద్దగా మారేదేం ఉండదేమో!!