Begin typing your search above and press return to search.

ఇల్లీ బేబీకి అంత సీనుందా

By:  Tupaki Desk   |   25 Nov 2018 11:37 AM IST
ఇల్లీ బేబీకి అంత సీనుందా
X
మాస్ సినిమాల కేరాఫ్ అడ్రెస్ బోయపాటి శీను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబోలో రూపొందుతున్న వినయ విధేయ రామ ఇంకొక్క పాట మాత్రమే బాలన్స్ ఉంది. అది పూర్తి చేస్తే గుమ్మడి కాయ కొట్టేయోచ్చు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు బిజీగా ఉన్న చరణ్ డిసెంబర్ మొదటి వారంలో దానికో బ్రేక్ ఇచ్చి ఈ సాంగ్ కోసం వెనక్కు వస్తాడు. కాకపోతే ఇక్కడొక చిక్కొచ్చి పడింది.

బాలన్స్ ఉన్నది ఐటెం సాంగ్. ఎవరైనా పేరున్న హీరొయిన్ చేస్తే మంచి క్రేజ్ వస్తుంది. రంగస్థలంలో జిగేల్ రాణిలో పూజ హెగ్డే అందాలు ఎంత ప్లస్ అయ్యయో చూసాంగా. అందుకే బోయపాటి శీను ఎవరైతే బాగుంటుందా అనే అన్వేషణలో తలమునకలైనట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ రాశి ఖన్నాల పేర్లు వినిపించాయి కాని డేట్ల సమస్య వల్ల కుదరదని చెప్పారని ఇన్ సైడ్ టాక్. సరే ఇంకా గ్లామర్ తో అందంగానే ఉంది కదా ఇలియానాతో చేసే ఆలోచన చేసిందట టీమ్. అంతే కాదు ఏకంగా ప్రతిపాదన పంపిందట. దానికి అమ్మడు ఏకంగా 60 లక్షలు డిమాండ్ చేసిందని ఫిలిం నగర్ టాక్. దీంతో ఫిగర్ చూసి మతిపోయినంత పని కావడంతో వేరే ఆలోచన చేస్తున్నారట.

నిజానికి ఇలియానా చరణ్ కు జోడిగా సెట్ కాదు. బాడీ మీద అదుపు తప్పి కాస్త ఒళ్ళు పెరగడం అమర్ అక్బర్ ఆంటోనీలో చూసిందే. పైగా తనతో ఐటెం సాంగ్ అంటే అభిమానులు సైతం ఏమంత ఉత్సాహం చూపకపోవవచ్చు. మరి నిజంగా ఇలియానా దగ్గరికి ప్రపోజల్ వెళ్లిందో లేదో కానీ ఫ్యాన్స్ మాత్రం మంచి ఆప్షన్ ట్రై చేయమని బోయపాటిని కోరుతున్నారు. ఒకపక్క టైం ముంచుకొస్తోంది. ఫైనల్ గా శీను ఎవరిని సెట్ చేస్తాడో వేచి చూడాలి