Begin typing your search above and press return to search.

ఇల్లీ బేబీ మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ

By:  Tupaki Desk   |   3 Oct 2018 6:33 PM IST
ఇల్లీ బేబీ మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ
X
చాలా అవార్డుల ఈవెంట్స్ ఉంటాయి. అందులో బెస్ట్ యాక్టర్.. బెస్ట్ యాక్ట్రెస్ లాంటి కేటగిరీలు ఉంటాయి. ఇక ఇవి కాకుండా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అని డిజైరబుల్ వుమన్ అని కూడా మరో రకమైన టాగ్స్ ఉంటాయి. అలాంటిదే ఈ 'మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ' ట్యాగ్. సెన్సేషనల్ సెలబ్రిటీ అనగానే శ్రీరెడ్డి టైపులో సెన్సేషన్ సృష్టించే సెలబ్రిటీ అని మీరనుకుంటే పల్చగా ఉన్న పప్పులో కాలేసినట్టే. ఇది మరో రకమైన సెన్సేషన్.

టెక్నాలజీ కంపెనీ మెక్ అఫీ వారు తమ పన్నెండో ఎడిషన్ 'మెక్ అఫీ మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ' సర్వే రిజల్ట్ ను రీసెంట్ గా ప్రకటించారు. అంటే ఏ సెలబ్రిటీ పేరు.. ఫోటో పెడితే మీరు లింక్ క్లిక్ చేసి హ్యాకర్ల బుట్టలో పడతారో.. మీ డేటా పోగొట్టుకుని గుండు చేయించుకుంటారో ఆ సెలబ్రిటీలన్నమాట. ఈ సర్వేలో గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ మొదటి స్థానంలో నిలిచింది. పోయినేడాది ఈ స్థానం స్టార్ కమెడియన్ కపిల్ శర్మ ది.

ఇక ఇలియానా తర్వాత స్థానాల్లో ప్రియాంక చోప్రా.. దీపిక పదుకొనే.. ప్రీతీ జింటా.. టబు.. కృతి సనన్.. అక్షయ్ కుమార్.. రిషి కపూర్.. పరిణీతి చోప్రా.. గోవిందా లు ఉన్నారు.. అంటే సైబర్ క్రిమినల్స్ వీరి ఫోటోలు.. ఇతర ఇన్ఫర్మేషన్ ను ఎరగా వాడి నెటిజనులను మోసం చేసేందుకు..ప్రయత్నిస్తున్నారన్నమాట. ఈ సారి గోవా బ్యూటీ.. నడుము సుందరి.. ఇల్లీ బేబీ.. లాంటి పేర్లతో లింక్స్ ఫోటోలు కన్పిస్తే అతిగా ఆవేశ పడకుండా కాస్త ముందు వెనక అలోచించి ఆ లింక్స్ ను క్లిక్ చేయండి. లేదంటే గోవా ఉన్న పడమరకు తిరిగి గోవిందా గోవిందా అనుకుంటూ దండం పెట్టడమే!