Begin typing your search above and press return to search.

షేమ్ లేస్.. అయినా మార్చుకోను -ఇలియానా

By:  Tupaki Desk   |   8 Feb 2017 5:44 AM GMT
షేమ్ లేస్.. అయినా మార్చుకోను -ఇలియానా
X
ఫోటోలకు పోజులు ఇవ్వడంలో ఇలియానా బాగా ఆరితేరిపోయింది. రకరకాల యాంగిల్స్ లో పోజులు ఇవ్వడం.. సెక్సీ పోజులతో కవ్వించడం.. అందాలతో కనుల విందు చేయడం లాంటివి కొత్తేమీ కాదు. కానీ రోడ్డుపైనో.. మాల్స్ లోనే ఉండే సైన్ బోర్డులను పక్కాగా వాడేసి ఫోటోలకు పోజులు ఇచ్చి తెగ తిట్టించేసుకుంటోంది.

రీసెంట్ గా ఈమె తన ఇన్ స్టాగ్రామ్ లో బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో కలిసి ఇచ్చిన పోజ్ భలే అసహ్యంగా ఉంది. తన లవర్ ని వెనకనుంచి గట్టిగా వేసుకోవడమే కాదు.. కుడి కాలుతో అతగాడిని దాదాపు లాక్ చేసేసింది. అంతే కాదు.. ' షేమ్ లేస్.. అయినా మార్చుకోను' అంటూ ఓ కామెంట్ కూడా చేసింది ఇలియానా. ఇలాంటి పోజులకు నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. అసలు పాయింట్ ఏంటంటే.. ఆ పక్కనే ఉన్న సైన్ బోర్డులో 'టికెట్ లెస్ పార్కింగ్' అని ఉంటుంది. అంటే ఏంటో అర్ధం తెలుసు కదా.

తన కాలును.. తనను అమ్మడు అలా బాయ్ ఫ్రెండ్ మీద పార్క్ చేసుకుందన్న మాట. చూసేందుకు అగ్లీగానే ఉన్నా.. సైన్ బోర్డ్ ను ఉపయోగించుకున్న తీరును మాత్రం పొగడాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/