Begin typing your search above and press return to search.

నాజూకు అందాలతో కవ్విస్తున్న గోవాబ్యూటీ!

By:  Tupaki Desk   |   24 April 2021 11:00 AM GMT
నాజూకు అందాలతో కవ్విస్తున్న గోవాబ్యూటీ!
X
స్టార్ హీరోయిన్ ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ గోవా బ్యూటీ కెరీర్ ప్రారంభించి స్టార్డం అందుకుంది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాబట్టి. అయితే కొన్నేళ్ల కిందట టాలీవుడ్ కు బై చెప్పి బాలీవుడ్ వైపు అడుగులేసిన ఇలియానా.. ఫస్ట్ మూవీ బర్ఫీతో సాలిడ్ హిట్ అందుకుంది. ఆ హిట్టుతో అమ్మడు వరుసగా బాలీవుడ్ యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. కానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. నిజానికి టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ షో, స్కిన్ షో ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్లి అన్ని చేసింది ఆఖరికి టు-పీస్ బికినీ కూడా ధరించింది అమ్మడు. తెలుగు ప్రేక్షకులకు ఇలియానా అంటే వయ్యారమైన నడుము మాత్రమే తెలుసు. కానీ బాలీవుడ్ లో అడుగు పెట్టాక ఖచ్చితంగా మారాల్సిందే.

ఆ మధ్యలో ఓ ఫారెన్ కుర్రాడితో ప్రేమాయణం నడిపింది. కానీ ఏమైందో గాని బ్రేకప్ చెప్పేసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే పనిలో పడింది. అమర్ అక్బర్ ఆంథోని సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది కానీ ఇలియానా ఈ సినిమాలో లావుగా ఉండటమే కాకుండా సినిమా కూడా బెడిసికొట్టింది. అయితే లాభం లేదని లాక్డౌన్ సమయంలో మళ్లీ నాజూకుగా మారింది. ప్రస్తుతం ఇలియానా నాజూకు వయ్యారాలను బికినీ రూపంలో ఫ్యాన్స్ ముందు పెడుతోంది. ఇదివరకు ఇలియానా బికినీ వేస్తుందా అనేవారు షాక్ అయ్యేలా అమ్మడు ఈ మధ్య కేవలం బికినీలో మాత్రమే ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలియానా బీచ్ లో, అండర్ వాటర్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ పోస్ట్ చేసింది. ఒక్కో ఫోటోలో ఒక్కోలా ఊరిస్తున్నాయి ఇలియానా అందాలు. కానీ ఇప్పుడైతే ఓల్డ్ నాజూకు ఇలియానాను చూస్తూ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.