Begin typing your search above and press return to search.

చివరకు ఇల్లీ అక్కడ ఆగింది

By:  Tupaki Desk   |   10 Jan 2016 4:20 AM GMT
చివరకు ఇల్లీ అక్కడ ఆగింది
X
చేతిలో ఆఫర్లులేని ఇలియానాకు ఆ మధ్యన జాకీ చాన్ సినిమాలో ఛాన్సొచ్చిందని తెలియగానే ఆమె అభిమానులు ఎగిరి గంతేశారు. గోవా సుందరి ఇక లాస్‌ ఏంజెలిస్‌ లో జెండా పాతేయనుంది పొగిడేశారు. కట్‌ చేస్తే.. నడుం సుందరి ఛాన్సును అమైరా దస్తూర్‌ తన్నుకుపోయింది. తెలుగులో రామ్‌ చరణ్‌ తనిఒరవున్‌.. పూరి జగన్‌ రోగ్‌ సినిమాలను కూడా వదిలేసుకుని అమైరా ఆ ఛాన్సు పట్టేసింది.

మరి ఇల్లి పరిస్థితి ఏంటి? మొన్నటివరకు బాయ్‌ ఫ్రెండ్‌ గురించి తెగ మాట్లాడిన ఈ నడుం బ్యూటి.. ఇప్పుడు మాత్రం కేవలం ఫోటోగ్రాఫీ గురించే మాట్లాడుతోంది. సడన్‌ గా ఇక అమ్మడిని ఫిలిం అవార్డుల ఫంక్షన్లకు పిలువకపోయినా కూడా.. ఒక ప్రముఖ లగ్జరీ కారు కాంపెనీ తమ కార్‌ లాంచింగ్‌ కు పిలిచింది. వెంటనే వచ్చేసింది ఇల్లీ. ఏ ఆఫరూ లేనప్పుడు కార్‌ ఓపెనింగ్‌ ఆఫర్లైనా బెటరేగా.. అందుకే ''ఐ యామ్‌ ఫ్లిర్టింగ్‌ విత్‌ దిస్‌'' దాని గురించి కూడా గొప్పగానే చెప్పుకుంటోంది అమ్మడు.

ఆ మధ్యన తెలుగులో సంతోషం అవార్డుల ఫంక్షన్లో.. తరువాత చిరంజీవి బర్తడే పార్టీ #మెగా60లో మెరిసినప్పుడు ఉన్న గ్లో.. ఇప్పుడు అమ్మడి ఫేస్‌ లో లేదు. టాలీవుడ్‌ ఏమైనా ఛాన్సులిచ్చి ఖుషీ చేస్తుందేమో పాపాయిని.. చూద్దాం మరి.