Begin typing your search above and press return to search.

అతనితో ఇల్లి స్మూత్ గా..

By:  Tupaki Desk   |   6 Dec 2017 11:56 AM GMT
అతనితో ఇల్లి స్మూత్ గా..
X

దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలను చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి తన స్టార్ ఇమేజ్ ను కొన్నేళ్ల వరకు ఒక రేంజ్ లో మెయింటెన్ చేసిన ఇల్లి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. వయసు మీద పడుతున్నా బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్ లు సాగిస్తున్నా అందంతో మాత్రం ఈ బ్యూటీ ఏ మాత్రం అశ్రద్ధ వహించడం లేదు.

అలాగే అవకాశాలను కూడా బాగానే అందుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్స్ మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది. అయినా ఇల్లి తనదైన శైలిలో గ్లామర్ టచ్ ని ఇస్తూ పోటీని తట్టుకుంటోంది. ఇక ఇటీవల ఆమె నటించిన సినిమాలు కూడా మంచి హిట్స్ అవుతున్నాయి. చివరగా అజయ్ దేవగన్ తో నటించిన బాద్షాహో సినిమా మంచి హిట్ అయ్యింది. వసూళ్లపరంగా కూడా ఆ సినిమా మంచి లాబాలనే అందించింది. అజయ్ అండ్ ఇలియానా మధ్య కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్ అయ్యింది.

ఆడియెన్స్ కూడా వారి రొమాన్స్ కి ఫిదా అయ్యారు. మంచి ప్రశంసలను అందుకున్న ఈ జంట మరోసారి కలిసి స్క్రీన్ ని హీటెక్కించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తోన్న రైడ్ అనే సినిమాలో అజయ్ - ఇలియానా మెయిన్ లీడ్ లో కనిపించనున్నారు. ఆ సినిమా కథ ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ నేపథ్యంలో ఉండనుంది. దేశంలో జరిగిన కోన్నీ నిజమైన రైడ్స్ ఆధారంగా చేసుకొని సినిమాను తెరకెక్కిస్తున్నారు. అజయ్ దేవగన్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అజయ్ తో నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని అతనీతో వర్క్ చాలా స్మూత్ గా నడుస్తోందని అంటోంది నడుం సుందరి ఇలియానా!!