Begin typing your search above and press return to search.

చెమ‌ట‌లు ప‌ట్టించ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ సుమీ!

By:  Tupaki Desk   |   26 Nov 2021 11:30 AM GMT
చెమ‌ట‌లు ప‌ట్టించ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ సుమీ!
X
వేడెక్కించే భంగిమ‌ల‌తో ఆక‌ట్టుకోవ‌డం ఎలానో ఇల్లీ బేబీకి తెలిసినంత‌గా వేరొక బ్యూటీకి తెలీదు. ఇటీవ‌ల జిమ్ కి వెళితే అక్క‌డి నుంచి లైవ్ ఫోటోల‌ను షేర్ చేస్తూ కుర్రాళ్ల కంటికి కునుకు ప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తోంది. ఇటీవ‌ల ఇలియానా అమాంతం బ‌రువు పెరిగి దాని నుంచి బ‌య‌ట‌పడేందుకు చాలానే శ్ర‌మించింది. ఇప్ప‌టికి ఆమె బరువు తగ్గింది. అస‌లే సినిమాల్లేక ఖాళీగా ఉన్న ఈ బ్యూటీ లాక్ డౌన్ లో బాగానే షేప‌ప్ అయ్యింది.

త‌దుప‌రి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సీరియ‌స్ ప్ర‌య‌త్నాల్లో ఉంది. పునరాగమనం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అందు కోసం ఎంత‌గా శ్ర‌మిస్తోందో ఈ ఫోటోలు వీడియోలతో అర్థ‌మ‌వుతుంది. ప్రస్తుతం ఇలియానా చెమటలు క‌క్కుతున్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. వీటిని తన ఇన్ స్టాగ్రామ్ పేజీ ద్వారా ఇలియానా పంచుకుంది. అస‌లే త‌డిసిన అందాలు ఆపై ఇన్న‌ర్ స్పోర్ట్ లుక్ లో క‌నిపించి మ‌తులు చెడ‌గొడుతోంది.

ఇలియానా చాలా దృఢంగా మళ్లీ బరువు తగ్గాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇండ‌స్ట్రీలో కంబ్యాక్ అవ్వాలంటే ఆమాత్రం క‌ష్టం త‌ప్ప‌నిస‌రి. ఎంత‌గా స్లిమ్ అయితే అంత‌గా ఆఫ‌ర్లు ద‌క్కుతాయి. రవితేజ అమర్ అక్బర్ ఆంథోనితో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా విజ‌యం ద‌క్క‌లేదు. తిరిగి టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలంటే ల‌క్ క‌లిసి రావాల్సిందే. ఇప్ప‌ట్లో తెలుగు ఆడియెన్ కి ఈ గోవా బ్యూటీ నుంచి ట్రీట్ లేదు. ప్ర‌స్తుతం త‌న స్నేహితుల‌కు ఫీల‌ర్స్ వ‌దిలింది. కానీ ఆఫ‌ర్లు రావ‌డానికే ఇంకా చాలా స‌మ‌యం ప‌ట్టేట్టు ఉంద‌ట‌. ఈలోగా హిందీ అసైన్ మెంట్స్ పూర్తి చేయాల్సి ఉంద‌ని స‌మాచారం.