Begin typing your search above and press return to search.

ఫరా.. ఐలీన్.. ఇలియానా.. 3 టాటూలు

By:  Tupaki Desk   |   3 July 2017 6:04 AM GMT
ఫరా.. ఐలీన్.. ఇలియానా.. 3 టాటూలు
X
టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న టైంలోనే గోవా బ్యూటీ ఇలియానా.. బాలీవుడ్ కి చెక్కేసింది. ఆశించిన స్థాయిలో కాకపోయినా.. అక్కడ బాగానే వెలుగుతోంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులర్ అయింది.

ఆస్ట్రేలియన్ లవర్ ఆండ్రూ నీబోన్ తో కలిసి ఇన్ స్టాగ్రామ్ లో ఇలియానా రచ్చ చేసి పారేస్తూ ఉంటుంది. వీటితో పాటు అమ్మడికి ట్యాటూలపై కూడా మక్కువ ఎక్కువ. ఇప్పటికే ఈ భామ ఒంటిపై రెండు పచ్చబొట్లు ఉంటాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో ట్యాటూ వేయించుకున్న ఈ భామ.. రెండు డాట్స్.. ఒక సర్కిల్ ను పచ్చ పొడిపించుకుంది. కాకపోతే ఈ సారి తన ఇద్దరు సిస్టర్స్ కలిసి.. ఓ కాన్సెప్ట్ ప్రకారం ట్యాటూ వేయించుకుంది ఇల్లీ బేబీ. ముగ్గురి చేతులపైనా రెండు మచ్చలు.. ఒక సర్కిల్ కనిపిస్తాయి. కాకపోతే.. సర్కిల్ ప్లేస్మెంట్ తేడాగా ఉంటుంది. ఈ పుట్టుమచ్చకు అర్ధం ఏంటో తానే చెప్పింది ఇలియానా.

'ఫరా.. ఐలీన్.. ఇలియానా.. మేము ముగ్గురం అక్కా చెల్లెళ్లం. అందరి చేతులపై(అరచేయి వెనుకవైపు) ఈ పచ్చబొట్టు ఉంటుంది. ఎవరికి వారు సింబల్ సర్కిల్ అన్నమాట. ముగ్గురిలో నేను మధ్యదాన్ని కాబట్టి.. నా చేతిపై ఉన్న ట్యాటూలో సర్కిల్ మధ్యలో ఉంటుంది. మిగిలిన రెండు డాట్స్ మా సిస్టర్స్ కి సింబల్. రీసెంట్ గా అమెరికా వెళ్లినపుడు ఈ ట్యాటూస్ వేయించుకున్నాము' అని చెప్పింది ఇల్లీ బేబీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/