Begin typing your search above and press return to search.

బాలు లేచి రా.. ఇళయరాజా ఎమోషనల్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   15 Aug 2020 1:40 PM IST
బాలు లేచి రా.. ఇళయరాజా ఎమోషనల్‌ కామెంట్స్‌
X
గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో ఈనెల మొదట్లో ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని ఆయనే స్వయంగా ఒక వీడియోను షేర్‌ చేసి అందరికి తెలియజేశారు. త్వరలోనే కరోనాను జయిస్తాననే నమ్మకంను వ్యక్తం చేసిన బాు త్వరలో డిశ్చార్జ్‌ అవుతారని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా ఆయన ఆరోగ్యం బాగోలేదని ఆయన్ను ఐసీయూకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో సినీ ప్రముఖులు అతా కూడా సోషల్‌ మీడియా ద్వారా ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థను చేస్తూ ఉన్నారు. బాలుకు ఆప్త మిత్రుడు మరియు అజాత శత్రువు అంటూ పేరున్న ఇళయరాజా కూడా ఈ విషయమై స్పందించాడు.

బాలు అనారోగ్య పరిస్థితిపై ఇళయరాజా స్పందిస్తూ... బాలు త్వరగా లేచి రా నీ కోసం మేము అంతా ఎదురు చూస్తున్నాం. మన స్నేహం కేవలం సినిమాల వరకే పరిమితం కాదు. మనం గొడవ పడ్డ సందర్బాల్లో కూడా ఇద్దరి మద్య స్నేహం కొనసాగింది. మనిద్దరి మద్య మాటలు లేని సమయంలో కూడా మన స్నేహం చెక్కు చెదరలేదు. ఎల్లప్పుడు మనం స్నేహితులుగానే ఉన్నాం. నువ్వు బాగుంటావని నీ ఆరోగ్యం త్వరలోనే కుదుట పడుతుందని నీవు త్వరలోనే నన్ను కుస్తావని నా అంతరంగం చెబుతోంది అంటూ ఇళయరాజా ఎమోషనల్‌ అయ్యారు.

వీరిద్దరు అప్పట్లో ఆప్త మిత్రులు. అయితే బాలు తన పాటలను రాయల్టీ చెల్లించకుండా పాడుతున్నాడు అంటూ ఇళయరాజా కోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇళయరాజా పాటలను బాలు స్టేజీలపై పాడటం మానేశారు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరి మద్య వివాదం తొలగి పోయి మళ్లీ స్నేహంగా మెలుగుతున్నారు. ఇద్దరి మద్య విభేదాలు వచ్చినా అవి వారి స్నేహం కారణంగా వెంటనే తొలగి పోయాయి.