Begin typing your search above and press return to search.

ఇళ‌యదళపతి 65ః విజయ్ సరసన బుట్ట‌బొమ్మ ఫైన‌ల్‌!

By:  Tupaki Desk   |   24 March 2021 6:11 PM IST
ఇళ‌యదళపతి 65ః విజయ్ సరసన బుట్ట‌బొమ్మ ఫైన‌ల్‌!
X
కోలీవుడ్ స్టార్ ఇళ‌‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ 65వ సినిమాలో బుట్ట‌బొమ్మ ఛాన్స్ కొట్టేసింది. యంగ్ డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న ఈ మూవీలో.. పూజాహెగ్డేను ఫైన‌ల్ చేసిన‌ట్లు నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది. ఈ మేర‌కు ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది.

''క‌ళానిధి మార‌న్ స‌మ‌ర్పించు.. ద‌ళ‌ప‌తి 65.. స్ట‌న్నింగ్ దివా.. పూజా హెగ్డే వెల్క‌మ్ ఆన్ బోర్డ్‌'' అంటూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మేకర్స్. ఈ వీడియోను ట్విట‌ర్ లో అధికారికంగా పోస్ట్ చేసింది స‌న్ పిక్చ‌ర్స్‌. ఇదే వీడియోను పూజాహెగ్డే కూడా షేర్ చేసింది.

ఫెంటాస్టిక్ యాక్ట‌ర్ విజ‌య్ తో క‌లిసి ఈ సినిమాలో భాగం అవుతుండ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని, షూటింగ్ మొద‌ల‌య్యే వ‌రకు ఆగ‌లేక‌పోతున్నాన‌ని రాసుకొచ్చింది పూజా. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచ‌ల‌నం అనిరుధ్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌బోతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ లో టాప్ పొజిష‌న్‌ లో ఉన్న పూజా.. ఈ సినిమాతో కోలీవుడ్‌లోనూ బిజీ అయ్యే ఛాన్స్ ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


వీడియో కోసం క్లిక్ చేయండి