Begin typing your search above and press return to search.

సాయిపై మరోసారి ఫిర్యాదు చేసిన ఇళయరాజా

By:  Tupaki Desk   |   1 Aug 2020 9:30 AM IST
సాయిపై మరోసారి ఫిర్యాదు చేసిన ఇళయరాజా
X
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మరియు ప్రసాద్‌ స్టూడియోస్‌ అధినేత ఎల్వీ ప్రసాద్‌ మనవడు సాయి ప్రసాద్‌ మద్య వివాదం కొనసాగుతున్న విషయం తెల్సిందే. చాలా ఏళ్ల క్రితం ఎన్వీ ప్రసాద్‌ చెన్నై లోని ప్రసాద్‌ స్టూడియోలో ఒక ప్రత్యేకమైన రూంను ఇళయరాజాకు బహుమానంగా ఇచ్చాడు. నాలుగు దశాబ్దాలుగా ఇళయరాజా అక్కడ నుండే తన సంగీత కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు సాయి ప్రసాద్‌ ఆ రూంను స్వాదీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దాంతో కొన్ని రోజుల క్రితం ఇళయరాజా పోలీసులను ఆశ్రయించిన విషయం తెల్సిందే.

తనకు ఎల్వీ ప్రసాద్‌ గారు బహుమానంగా ఇచ్చిన దాన్ని లాక్కునేందుకు ఆయన మనవడు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ జరుగుతుంది. ఈ సమయంలోనే ఇళయరాజా మేనేజర్‌ మరో కేసును ఫైల్‌ చేశాడు. సాయి ప్రసాద్‌ మరియు ఆయన అనుచయి బలవంతంగా ఇళయరాజా గారి రూంలోకి చొచ్చుకు వచ్చి అక్కడ ఉన్న ఖరీదైన మ్యూజిక్‌ ఎక్యూప్‌ మెంట్స్‌ మరియు సిస్టంమ్స్‌ ను నాశనం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్టూడియోలోకి దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ నుండి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నా కూడా వారు మాత్రం మళ్లీ స్టూడియో విషయంలో గొడవకు దిగారంటూ చెన్నై పోలీస్‌ కమీషనర్‌ కు ఇళయరాజా మేనేజర్‌ ఫిర్యాదు ఇచ్చాడు. సాయి ప్రసాద్‌ మరియు ఆయన అనుచరులపై క్రిమినల్‌ కేసులను నమోదు చేయాల్సిందిగా కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.