Begin typing your search above and press return to search.

క్రేజ్ తగ్గిపోయినా త‌గుదున‌మ్మా అంటూ!

By:  Tupaki Desk   |   1 Jun 2022 3:26 AM GMT
క్రేజ్ తగ్గిపోయినా త‌గుదున‌మ్మా అంటూ!
X
కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగి ఫ్లాపుల‌తో విసిగిపోయిన‌ ఆ భార్యామ‌ణి.. కెరీర్ ప‌రంగా ఎంతో ఆశించి భంగ‌ప‌డిన ఆమె భ‌ర్త ఇటీవ‌లి కాలంలో అవార్డుల కార్య‌క్ర‌మాల్లో అదే ప‌నిగా క‌నిపిస్తున్నారు. ఇంత‌కుముందు కేన్స్ 2022 ఉత్స‌వాల్లో బోలెడంత హంగామా సృష్టించారు. ఇప్పుడు ఏకంగా IIFA వీకెండ్ అవార్డ్స్ 22 లో ప్రత్య‌క్ష‌మ‌య్యారు. ఇంత‌కీ ఎవ‌రీ జంట‌? అంటే ఐశ్వ‌ర్యారాయ్‌- అభిషేక్ బ‌చ్చ‌న్ జంట గురించే.

భారతీయ సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక IIFA వీకెండ్ & అవార్డ్స్ 22వ ఎడిషన్ మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇండోర్ ఎంటర్ టైన్ మెంట్ వేదిక అబుదాబిలోని యాస్ ఐలాండ్ లోని యాస్ బే వాటర్ ఫ్రంట్ ఎతిహాద్ అరేనాలో జరుగనున్నాయి. డిపార్ట్ మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం సహకారంతో అబుదాబి (DCT అబుదాబి).. మిరల్.. అబుదాబిలో లీనమయ్యే చోట ఈ పుర‌స్కారాల ప్ర‌క‌ట‌న సాగ‌నుంది. సినిమా క్రియేటివిటీని నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ప్రపంచాన్ని ఏకం చేస్తూ IIFA జూన్ 2- 3- 4 తేదీల్లో ఈ పుర‌స్కారాలను వైభ‌వంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుక‌ల్లో అభిషేక్- ఐష్ సంద‌డి చేయ‌నున్నారు.

ఐఫాలో అభిషేక్ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇవ్వ‌నుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అత‌డు మాట్లాడుతూ.. IIFA నాకు కుటుంబం లాంటిది. తిరిగి ఈ వేడుక‌ల‌లో నేను ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉంది. రెండు సంవత్సరాలకు పైగా భౌతికంగా డిస్ కనెక్ట్ అయిన తర్వాత ఈ వేడుకలు మనల్ని ఏకం చేయడంలో సహాయపడతాయి. ప్రపంచం అంతా ఒక చోట మళ్లీ కలిసినప్పుడు పరిశ్రమల‌ పునఃకలయిక ఇద‌ని నేను సంతోషిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల‌తో కనెక్ట్ అవ్వడానికి ఎదురుచూస్తున్నాను`` అని అభిషేక్ బచ్చన్ అన్నారు.

ఈ సంవత్సరం అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో జరిగే ఈవెంట్ కు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా హాజరవుతారు. IIFA 22వ ఎడిషన్ లో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నానని ఆమె అన్నారు. సంవత్సరాలుగా IIFA అవార్డ్స్ లో భాగమైనందుకు ఇది ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుంది. నిస్సందేహంగా ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమ .. శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరి కోసం ఎదురుచూసే గ్లోబల్ ఈవెంట్ అని అన్నారు.

ఐశ్వర్య రాయ్ మిలీనియం డోమ్ లో జరిగిన ప్రారంభ IIFA అవార్డ్స్ లో ఉత్తమ నటిగా IIFA అవార్డులు - గౌరవాలను అందుకున్నారు. 2005లో ఆమ్ స్టర్ డామ్ లో జరిగిన అవార్డుల‌ వారాంత వేడుక‌లో తులిప్ కు `ఐశ్వర్య` అని పేరు పెట్టారు. 2009లో మకావులో జరిగిన IIFA 10-సంవత్సరాల వేడుకలలో IIFA ఆమెకు `ఈ దశాబ్దపు నటి` అనే గౌరవాన్ని అందించింది. 2006లో మొదటిసారిగా UAEలో IIFA వేడుకలు జరిగినప్పుడు ఈ వేడుకల్లోనూ ఐశ్వర్య మెరిసింది.

దేశంలో పాపుల‌ర్ జంట‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బచ్చన్ లు IIFAకు విదేశాల‌లోనూ బ‌ల‌మైన‌ ప్లాట్ ఫారమ్ ను ఏర్పాటు చేయాల‌నే సంక‌ల్పంతో ప్ర‌యాణిస్తున్నారు. బచ్చన్‌లు నటించిన ప్రోవోక్డ్- సర్కార్- సర్కార్ రాజ్ -యువ వంటి చిత్రాలు సంవత్సరాల తరబడి IIFAలో రివ్యూవ‌ర్ల‌ ప్రీమియర్ గా ప్రదర్శిత‌మ‌వుతున్నాయి. అమితాబ్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ -అభిషేక్ బచ్చన్ నటించిన కజరారే అత్యంత గుర్తుండిపోయే IIFA ప్రదర్శనలలో ఒకటి. అయితే ఇటీవ‌లి కాలంలో ఐష్ కి కూడా క్రేజ్ త‌గ్గింది. అభిషేక్ స‌న్నివేశం ఎలాంటిదో తెలిసిన‌దే. కానీ ఈ జంట ప్ర‌ధాన అవార్డుల వేడుక‌ల‌ను అస్స‌లు విడిచిపెట్ట‌డం లేదు. దీనిపై అభిమానులు ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.