Begin typing your search above and press return to search.

IIFA 2022 లో అభితో ఐష్ డ్యాన్సులు వైర‌ల్

By:  Tupaki Desk   |   6 Jun 2022 8:58 AM IST
IIFA 2022 లో అభితో ఐష్ డ్యాన్సులు వైర‌ల్
X
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA అవార్డ్స్ 2022) ఉత్స‌వాలు ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్రాండ్ ఈవెంట్ అబుదాబిలో జరిగింది. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ -ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఈ గ్రాండ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారి డ్యాన్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బచ్చన్ ద్వయం త‌మ‌ నృత్యాన్ని ఆస్వాధించారు. ఈవెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జంట ముచ్చ‌ట్ల‌ను నృత్యాన్ని ఇష్టపడ్డారు. ఈ అరుదైన వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. త‌క్కువ స‌మ‌యంలో విపరీతమైన లైక్ లు వీక్షణలను సంపాదించుకుంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఐష్ ఒకే ఒక్క చిత్రంలో న‌టిస్తోంది. త‌న గురూజీ మణిరత్నం తెరకెక్కిస్తున్న `పొన్నియిన్ సెల్వన్` షూటింగ్ లో బిజీగా ఉంది. ఈలోగా అభిషేక్ తదుపరి తమిళ చిత్రం `ఒత్త సెరుప్పు సైజ్ 7` రీమేక్ లో కనిపించనున్నాడు. స్టార్ క‌పుల్ కెరీర్ ప్ర‌స్తుతం నెమ్మ‌దిగా సాగుతోంది.

IIFA అవార్డ్స్ 2022ని సల్మాన్ ఖాన్- రితీష్ దేశ్‌ముఖ్ - మనీష్ పాల్ హోస్టింగ్ చేశారు. గ్రాండ్ ఈవెంట్ నుండి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అభిమానులు పూర్తి అవార్డు ఫంక్షన్ ని టీవీల‌లో వీక్షించేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. ఈ వేడుక‌ల్లో విక్కీ కౌశ‌ల్ న‌టించిన `స‌ర్ధార్ ఉధ‌మ్` మూడు విభాగాల్లో అవార్డుల‌ను అందుకుంది. విక్కీ కౌశ‌ల్ కి ఉత్త‌మ న‌టుడు అవార్డు ద‌క్కింది. ఉత్తమ చిత్రంగా - షేర్షా..ఉత్తమ దర్శకుడుగా - విష్ణు వరదన్ (షేర్షా) పుర‌స్కారాలు ద‌క్కించుకోగా.. ఉత్తమ నటిగా - కృతి సనన్ (మిమీ).. ఉత్తమ సహాయ నటుడుగా - పంకజ్ త్రిపాఠి (లూడో) అవార్డులందుకున్నారు.

సల్మాన్ ఖాన్,- షాహిద్ కపూర్,- విక్కీ కౌశల్,- కృతి సనన్,- అభిషేక్ బచ్చన్,- ఐశ్వర్య రాయ్ బచ్చన్, -అనన్య పాండే,- సారా అలీ ఖాన్, -AR రెహమాన్, -టైగర్ ష్రాఫ్,- నోరా ఫతేహి,- యో యో హనీ సింగ్,- పంకజ్ త్రిపాఠి సహా పలువురు ప్రముఖులు వేడుక‌ల‌కు హాజరయ్యారు