Begin typing your search above and press return to search.

గోవా బ్యూటీని 'జీన్స్ - థైస్'లో చూస్తే నయనానందం అంతే!!

By:  Tupaki Desk   |   5 Jan 2021 3:15 PM GMT
గోవా బ్యూటీని జీన్స్ - థైస్లో చూస్తే నయనానందం అంతే!!
X
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కేవలం తన నడుము అందాలతోనే కొల్లగొట్టిన గోవా భామ ఇలియానా. కెరీర్ ప్రారంభం నుండి మొన్నటి 'దేవుడు చేసిన మనుషులు' వరకు తన సోయగాలతో కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఆ మధ్య సినిమాలకు దూరంగా ఉండి బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి, ప్రేమ అంటూ తిరిగిన ఇలియానా.. కొద్దికాలానికే ప్రేమకు బ్రేకప్ చెప్పేసి సింగిల్ లైఫ్ బెటర్ అంటోంది. ఆ టైంలో బాగా లావు కూడా అయింది. అమ్మడిని చూసి ఇకపై సినిమాలు చేయదేమో అనుకున్నారు. కానీ మళ్లీ సినిమాలు చేస్తానంటూ మాస్ రాజా రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా చేసింది. ఎప్పటిలాగే ఇలియానా నుండి గ్లామర్ షో ఆశించే అభిమానులకు ఆ సినిమాలో నిరాశే మిగిలింది. మరోవైపు సినిమా కూడా ప్లాప్ అయింది. అప్పటి నుండి మళ్లీ గోవా భామ పేరు తెలుగులో వినిపించలేదు.

తాజాగా అమ్మడు సోలో లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇలియానా ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. రోజురోజుకి అమ్మడి ఫిగర్ చూస్తే సన్నబడుతుందని అర్ధమవుతుంది. ఫుల్లుగా వర్కౌట్స్ చేస్తూ.. బీచ్ లలో కేరింతలు కొడుతోంది. బాయ్ ఫ్రెండ్ రాకముందు ఎంత నిండుగా డ్రెస్సింగ్ మెయింటైన్ చేసేదో.. బ్రేకప్ తర్వాత ఓ రేంజిలో బికినీలు, క్లీవేజ్ షోలతో రెచ్చిపోతుంది. ఈ మధ్యే బీచ్ లో బికినీ వేస్తూ సెల్ఫీలతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఇల్లి బేబీ జీన్స్ టిషర్ట్ ఫోటోలతో మతులు పోగొడుతుంది. వర్కౌట్స్ చేస్తూ సన్నబడిన గోవా బేబీ చలవకళ్లద్దాలు ధరించి, హ్యాండ్ బ్యాగ్ చేతప్పటి దర్శనమిచ్చింది. కానీ ఇలియానా అందాలను మాత్రం ఫ్యాన్స్, ఫాలోయర్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మడి పిక్స్ నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.