Begin typing your search above and press return to search.

వెంకీ కూతురు మాటలు వింటే ఫిదా కావాల్సిందే

By:  Tupaki Desk   |   19 July 2021 3:52 AM GMT
వెంకీ కూతురు మాటలు వింటే ఫిదా కావాల్సిందే
X
ఎవరెన్ని చెప్పినా టాలీవుడ్ లో అత్యంత శక్తివంతమైన కుటుంబాల్లో దగ్గుబాటి కుటుంబానికి ఉన్న బలం.. బలగం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీని అమితంగా ప్రభావితం చేసే కుటుంబం నుంచి వచ్చిన వారు ఎవరైనా సరే.. తమ ఇంటి పేరును సగర్వంగా చెప్పుకోవటానికి ఇష్టపడతారు. మక్కువ చూపిస్తారు. అందుకు భిన్నంగా స్వయంకృషితో ఎదగటం.. పేరు ప్రఖ్యాతులు వచ్చే వరకు.. ఫలానా వారి అమ్మాయి అన్న ట్యాగ్ లేకుండా చేసుకోవటం అంత మామూలు విషయం కాదు. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత అలాంటి పనే చేశారు.

ఇటీవల ఇన్ స్టాలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్ డాట్ కాం విడుదల చేయటం.. అందులో అంతర్జాతీయ స్థాయిలో ఆశ్రిత 377వ స్థానంలో నిలవటం.. ఆసియాలో 27వ ర్యాంకు సాధించటం తెలిసిందే. తెలుగు పేరు కనిపించటం.. ఇంతకీ ఆమె ఎవరన్నది చెక్ చేసినప్పుడే.. వెంకటేశ్ కుమార్తెగా గుర్తించారు. దీంతో.. ఆమెకు ఒక్కసారిగా భారీ క్రేజ్ ఏర్పడింది. అంత పెద్ద స్టార్ కుమార్తె అయినప్పటికీ.. సింఫుల్ గా ఉండటం.. తన కుటుంబం గురించిన వివరాలు చెప్పకుండా.. తనదైన టాలెంట్ తో ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఆమె ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు.

తాజాగా ఒక తెలుగు మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె మాటల్ని విన్నంతనే ఆమెకు ఫిదా కావటమే కాదు.. పే..ద్ద ఫ్యాన్ కావటం ఖాయం. ఇంతకూ ఆమె ఏం చెప్పారంటే..?

- టీనేజర్ గా ఉన్నప్పుడు నాన్న (వెంకటేశ్).. పెద్దనాన్న (సురేశ్ బాబు) షూటింగ్ ల కోసం విదేశాలకు వెళ్లేవారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి విశేషాలతో పాటు.. అక్కడి వంటల గురించి.. రుచుల గురించి చెప్పేవారు. వారి మాటలే.. కొత్త ప్రాంతాల్ని చూడాలని.. వింతలూ.. విశేషాలు తెలుసుకోవాలని.. ఆయా ప్రాంతాల రుచుల్ని ఆస్వాదించాలన్న ఆలోచన వచ్చింది. ఇప్పటివరకు 20 వరకు దేశాల్ని చూశా. ఇష్టమైన ప్లేస్ కర్ణాటకలోని కూర్గ్. యూకేలో చదువుకునే సమయంలో యూరోప్ అంతా తిరిగా. అప్పుడే యూరోప్ లో స్థిరపడాలని నిర్ణయించుకున్నా. పెళ్లైన తర్వాత మా ఆయనతో కలిసి స్పెయిన్ లోని బార్సిలోనాలో స్థిరపడ్డాం.

- ఎకనామిక్స్ లో మాస్టర్స్.. ఆపైన ఎంబీఏ చేశా. పుడ్.. ట్రావెల్.. ఫోటోగ్రఫీ రంగాలపై ఆసక్తే బ్లాగర్ గా మారేలా చేశాయి. ఇప్పటికైతే ఇదే నా ప్రధాన కెరీర్. బార్సిలోనాలో కల్నరీ షెఫ్ ప్రోగ్రాం చేస్తున్నా.. అదెక్కడి వరకు తీసుకెళుతుందో చూడాలి. బ్లాగ్ రాయాలని డిసైడ్ అయినప్పుడు ఇంట్లో వారంతా ప్రోత్సహించారు. నాన్న ఎన్నో ఐడియాలు ఇచ్చేవారు. ఫోటోగ్రఫీలో మెలకువలు నేర్పారు. అమ్మ మంచి క్రిటిక్. ఇప్పటికి చక్కటి ఫీడ్ బ్యాక్ ఇస్తుంది. పెద్దనాన్న (సురేశ్ బాబు) ఇచ్చే స్మార్ట్ బిజినెస్ టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

- నాన్న తక్కువగా మాట్లాడినా ఎక్కువగా అర్థం చేసుకుంటారు. నా నడకను చూసి కూడా నేను ఏ మూడ్ లో ఉంటానో చెప్పేస్తారు. నేను చేస్తున్న పనికి గర్విస్తున్నా అని నాన్న చెప్పినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేను. నా భర్త వినాయక్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అతడెంతో ప్రోత్సహిస్తుంటారు.

- ఇన్ స్టాలో ఇన్ఫినిటీ ప్లాటర్ స్టార్ట్ చేసినప్పుడు నేనెవరో ఎవరికీ తెలీదు. మొదటి మూడు నాలుగేళ్లు ఫుడ్ అండ్ ట్రావెల్ మీద ఆసక్తి ఉన్న వారు మాత్రమే నా పేజ్ ను ఫాలో అయ్యేవారు. ఏడాది నుంచే నన్ను గుర్తు పట్టటం మొదలు పెట్టారు. చిన్నప్టపి నుంచి మాకో రూల్ ఉంది. మమ్మల్ని మేం పరిచయం చేసుకునేటప్పుడు ఫ్యామిలీ పేరును.. వారికున్న ప్రతిష్ఠను ప్రస్తావించకూడదని ఇంట్లో చిన్నప్పటి నుంచి నేర్పారు. అందుకే నా కుటుంబం పేరును వాడాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది.

- కుటుంబ నేపథ్యంలో వల్లే నాకన్నీ సులభంగా వచ్చాయని జనం ఊహించుకుంటారు. అందుకే.. నా కలల్ని నా అంతట నేనే నెరవేర్చుకోవటం మొదలు పెట్టాను. ఇప్పుడు నాన్న.. అన్నయ్య.. వదిన వాళ్లు సోషల్ మీడియా పేజీల్లో నన్ను ట్యాగ్ చేస్తున్నారు.