Begin typing your search above and press return to search.

స్నేహా రెడ్డి ధ‌రించిన ఆ కోటు ధర తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

By:  Tupaki Desk   |   19 April 2022 9:30 AM GMT
స్నేహా రెడ్డి ధ‌రించిన ఆ కోటు ధర తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల్లో న‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. స్నేహా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఇప్ప‌టికే ఈమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవ‌ర్స్ సంఖ్య ఏకంగా ఎనిమిది మిలియ‌ర్స్ కు అతి చేరువ‌లో ఉంది. ఒక హీరో భార్యకు ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉండటం ఒక రికార్డు అని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. మొన్నీ మ‌ధ్య బ‌న్నీ త‌న 40వ‌ పుట్టినరోజు వేడుక‌ల కోసం భార్య‌, పిల్ల‌ల‌తో యూరప్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ మ‌రియు స్నేహితులతో కలిసి అక్క‌డ ఆయ‌న‌ గ్రాండ్‌గా బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో బన్నీ ఫ్యామిలీ టూర్ ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన పిక్స్ కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

అయితే వీటిలో స్నేహా రెడ్డికి సంబంధించిన ఓ పిక్ మాత్రం నెట్టింట వైర‌ల్ గా మారింది. అందుకు కార‌ణం లేక‌పోలేదు.. ఆ పిక్ లో స్నేహా రెడ్డి లూయిస్ విట్టన్ కోటు ధరించింది. ఈ కోటు ధ‌ర ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. ఎందుకంటే, ఆ కోటు విలువ రూ. 5,09,311. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

దీంతో స్నేహా వేసుకున్న ఆ కోటు గురించి నెట్టింట ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వాస్త‌వానికి బ‌న్నీ మాదిరి స్నేహా కూడా మంచి ఫ్యాషన్ ఐకాన్. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ దుస్తులు ధ‌రించి గ్లామ‌ర్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేసే స్నేహా.. ఇప్పుడు ఫ్యాష‌న్ విష‌యంలో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

కాగా, బ‌న్నీ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల ఈయ‌న‌ 'పుష్ప ది రైస్‌' సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది.

ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా 'పుష్ప ది రూల్‌' రాబోతోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. మ‌ల‌యాళ న‌టుడు ఫహాద్‌ ఫాజిల్ విల‌న్ గా అల‌రించ‌బోతున్నాడు.