Begin typing your search above and press return to search.
బాక్సాఫీస్ బరిలో ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలు నిలిస్తే..!
By: Tupaki Desk | 15 May 2021 5:00 AM ISTటాలీవుడ్ కు నాలుగు మెయిన్ పిల్లర్స్ గా స్టార్ హీరోలు చిరంజీవి - నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ కొన్నేళ్లపాటు ఇండస్ట్రీని ఏలారు. ఇప్పుడు చాలా మంది నవతరం హీరోలు వచ్చిన తర్వాత 60 ప్లస్ ఏజ్ హీరోలందరూ సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు ఫెస్టివల్ సీజన్స్ వచ్చాయంటే బాక్సాఫీస్ బరిలో నువ్వా నేనా అంటూ వీళ్ళ సినిమాలే ఉండేవి. దశాబ్దాలుగా బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా ఉన్న ఈ నలుగురు సీనియర్ హీరోల్లో ఇప్పుడు చిరు - బాలయ్య - వెంకీ ఒకే సీజన్ లో పోటీ పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విడుదల తేదీలను ప్రకటించిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో మళ్ళీ సాదారణ పరిస్థితులు వస్తే ఎన్నడూ లేని విధంగా పెద్ద సినిమాల మధ్య క్లాషెస్ ఏర్పడే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ''ఆచార్య'' చిత్రాన్ని అన్నీ బాగుంటే మే 13న విడుదల చేయాల్సింది. కానీ వాయిదా పడింది. అయితే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
అలానే విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'నారప్ప' ని మే 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అప్పుడే 'ఆచార్య' కు పోటీగా నిలుస్తాడేమో అని అందరూ అనుకున్నారు. అయితే కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు. 'అసురన్' రీమేక్ గా వచ్చిన 'నారప్ప' ను కూడా దసరా బరిలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ' ని మే 28న విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించినప్పటికీ.. పరిస్థితులు చూస్తుంటే బాలయ్య సినిమా కూడా వాయిదా పడనుంది. అంతేకాక 'అఖండ' కూడా దసరా సీజన్ నే టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇలా ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలు విజయదశమి బాక్సాఫీస్ వార్ లో దిగుతారని ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరోవైపు 'ఆర్.ఆర్.ఆర్' అక్టోబర్ కి ఇంకా అవకాశం ఉందని ఎన్టీఆర్ చెబుతున్నారు. అలానే దసరా బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని 'పుష్ప' పార్ట్-1 చూస్తోంది. ఇక 'కేజీఎఫ్ 2' కూడా ఫెస్టివల్ సీజన్ కు కర్చీఫ్ వేయాలని చూస్తోంది. మరి అప్పటికి పరిస్థితులు చక్కబడి ఏయే సినిమాలు దసరా బరిలో దిగుతాయో చూడాలి.