Begin typing your search above and press return to search.

ఆ ఐదు వస్తే.. టాలీవుడ్‌ నుండి మరో పాన్‌ ఇండియా హీరో!

By:  Tupaki Desk   |   7 April 2022 11:40 AM GMT
ఆ ఐదు వస్తే.. టాలీవుడ్‌ నుండి మరో పాన్‌ ఇండియా హీరో!
X
టాలీవుడ్‌ యంగ్‌ హీరోలందు అడవి శేష్‌ వేరు అన్నట్లుగా ఉంటాడు. వరుసగా కమర్షియల్‌ సినిమాలు చేస్తూ.. మాస్‌ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు దాదాపు యంగ్‌ హీరోలు అంతా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఈయన మాత్రం హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.. విలన్‌ గా ఇంకా పలు రోల్స్ లో కనిపిస్తూ ఉన్నాడు. ఈయన హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల జాబిత చాలా పెద్దగా ఉంది.

మేజర్‌.. హిట్‌ సినిమాలు కాకుండా మరో మూడు సినిమాలు చర్చల దశలో మరియు షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఈ అయిదు సినిమాలు కూడా అడవి శేష్‌ ను పాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువ చేసే ప్రాజెక్ట్‌ లు అంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మేజర్‌ సినిమా ఇప్పటికే బాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువయ్యింది. వచ్చే నెలలో సినిమా విడుదల అయితే ఖచ్చితంగా హిందీ ప్రేక్షకులకు మనోడు మరింత రీచ్ అవుతాడు.

ఇక హిట్ సినిమా కూడా తప్పకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుందంటూ మేకర్స్ చెబుతున్నారు. యూనివర్శిల్‌ కాన్సెప్ట్ లను తీసుకుని.. ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలను మరియు యాక్షన్ సినిమాలను చేయడం వల్ల కేవలం ఒక ప్రాంతంకు పరిమితం కాకుండా అన్ని భాషల్లో కూడా ఆయన సినిమా ఆడేలా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. అందుకే అడవి శేష్‌ ఫ్యూచర్ పాన్ ఇండియా స్టార్‌ అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

స్వతహాగా రచయిత కూడా అయిన అడవి శేష్‌ తనదైన శైలిలో కథలను రాసుకుంటూ.. తనకు తాను పాన్ ఇండియా స్టార్‌ గా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన కావాలని చేస్తున్నాడా లేదంటే ఆయన తనదారిలో వెళ్తుంటే పాన్‌ ఇండియా స్టార్‌ గా ఆయన మారిపోతున్నాడా అనేది తెలియదు కాని.. ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు ఇప్పుడు చేస్తున్న సినిమా లు మరియు చేయబోతున్న సినిమాల.. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన స్థాయిని పెంచుతున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్‌ నుండి పలువురు పాన్ ఇండియా స్టార్ లు ఉన్నారు. వారంత కూడా భారీ బడ్జెట్‌ సినిమాలతో వందల కోట్ల కలెక్షన్స్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారారు. కాని అడవి శేష్‌ మాత్రం తక్కువ బడ్జెట్‌ సినిమాలు.. మరియు చిన్న థ్రిల్లర్‌ సినిమాలతోనే పాన్ ఇండియా స్టార్‌ హీరోగా మారే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం చేసిన.. చేస్తున్న ఐదు సినిమాలు వస్తే అంటే రాబోయే రెండేళ్లలో అడవి శేష్ పాన్ ఇండియా స్టార్‌ హీరోగా నిలుస్తాడంటూ ఆయన అభిమానులు మరియు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.