Begin typing your search above and press return to search.

ఛాన్స్ ఉంటే కమ్మకులంలో పుట్టాలని ఉంది: ఆర్జీవీ

By:  Tupaki Desk   |   4 Nov 2019 10:04 AM GMT
ఛాన్స్ ఉంటే కమ్మకులంలో పుట్టాలని ఉంది: ఆర్జీవీ
X
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాటలు మంచో చెడో దేవుడెరుగు.. ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటాయి. తాజాగా ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పనిలో పనిగా కొన్ని క్రేజీ కామెంట్లు కూడా చేసి తన స్టైలే వేరని నిరూపించుకున్నారు.

టైటిల్ లోనే కమ్మలు.. రెడ్లు అనే కులాల పేర్లు పెట్టడంపై మాట్లాడుతూ.. కమ్మరాజ్యం అంటే ఎపీ అనే ఉద్దేశం కాదని.. కమ్మల డామినేషన్ ఉన్న విజయవాడలో రెడ్లు పవర్ లోకి వచ్చారనే ఆలోచనతో పెట్టిన టైటిల్ అని చెప్పారు. ఇక తనకు కమ్మకులం అంటే ఇష్టమని చెప్పారు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందని.. అయితే అది కమ్మ క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పి షాక్ ఇచ్చారు. ఎందుకంటే కమ్మవారు నిజమైన రాజులు అని.. ఎపీని పాలించేవారని అన్నారు. తన క్యాస్ట్ అయిన రాజులు మాత్రం 'వచ్చారాండి.. భోంచేశారాండి' అని అంటారని.. నిజమైన మహారాజులు అలా ఎందుకు అంటారని సొంతకులంపై ఒక సెటైర్ వేసుకున్నాడు. ఇక భీమవరం రాజుల గురించి మాట్లాడుతూ.. 'చరిత్రలో వాళ్ళేమైనా చేశారా అని తనకు అనుమానం ఉందన్నారు. విజయవాడలో రౌడీయిజం ఉంది.. కడపలో ఫ్యాక్షన్ ఉంది.. హైదరాబాద్ లో దాదాగిరి ఉంది. భీమవరంలో అలా ఏముందో నాకు తెలియదు' అని చెప్పారు. ఒక ఛాన్స్ ఇస్తే మీరు ఏ కులంలో పుట్టాలని అనుకుంటారు? అని వర్మను అడిగితే తడుముకోకుండా 'కమ్మ' అని చెప్పారు.

మెగా ఫ్యామిలీ టాపిక్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్.. జనసేన ప్రస్తావన వచ్చింది. ఆ చర్చలో 'పవన్ ను చూడగానే మీకు ఏం అనిపిస్తుంది?' అని అడిగితే 'ఆయన చాలా సిన్సియర్ పర్సన్. మనసులో అనిపించినది చేసే వ్యక్తి. చాలా ఇంటెన్స్ పర్సన్. ఆయన మీటింగ్స్ లో మాట్లాడుతూ ఉంటే చూడాలనిపిస్తుంది.' అన్నారు. 'రాజకీయనాయకుడిగా పవన్ గురించి ఏమంటారు'? అని అడిగితే 'జనసేన పార్టీ అంత పటిష్టంగా ఉందని నాకెప్పుడూ అనిపించదు.. పవన్ పక్కన ఉండేవారు గట్టిగా ఉన్నారని కూడా నాకు అనిపించదు. పవన్ ను ఒక్కడిగా చూస్తే మాత్రం ఓకే' అని చెప్పారు.