Begin typing your search above and press return to search.

షన్నూకు సిరి ముద్దు పెడితే నేను ఏడవాలా.. ప్రియుడి రియాక్షన్‌

By:  Tupaki Desk   |   30 Oct 2021 6:34 AM GMT
షన్నూకు సిరి ముద్దు పెడితే నేను ఏడవాలా.. ప్రియుడి రియాక్షన్‌
X
బిగ్ బాస్ సీజన్‌ 5 కి ప్రత్యేక ఆకర్షణగా షన్నూ మరియు సిరిలు నిలుస్తున్నారు అనడంలో సందేహం లేదు. యూట్యూబ్‌ స్టార్స్ అయిన వీళ్లు కలిసి ఎన్నో షార్ట్స్ ఫిల్మ్స్ లో నటించారు. ఆ స్నేహంతో వీరిద్దరు కలిసి ఆడుతున్నారు అంటూ మొదట విమర్శలు వచ్చాయి. దాంతో షన్నూ ఆమెకు కాస్త దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడు. కాని ఆతర్వాత ఎందుకు దూరంగా ఉండాలి.. కలిసి ఆడితే తప్పు ఏంటీ అన్న ఆలోచనకు వచ్చిన షన్నూ ఆ తర్వాత నుండి ఆమెను దూరం పెట్టకుండా కలిసే ఆడుతున్నారు. ఒకే బెడ్ మీద పడుకునే వీళ్లు ఒకే బ్లాంకెట్ ను కూడా కప్పుకుని పడుకుంటారు. జెస్సీ వీరిద్దరికి మంచి స్నేహితుడు. షన్నూ మరియు జెస్సీలతో ఎప్పుడు దెబ్బలాడుతూనే వారిద్దరికి బెస్ట్‌ ఫ్రెండ్‌ గా సిరి నిలిచింది. అలాంటి సిరి షన్నూ పై ఊరికే అలుగుతూనే ఉంటుంది. అలాగే షన్నూ కూడా సిరిపై అలుగుతూ ఉంటాడు. అలా ఇద్దరు కూడా క్యూట్ గా రిలేషన్ ను మెయింటెన్‌ చేస్తున్నారు.

ఇద్దరు మంచి స్నేహితులు అని ఇంటి సభ్యులు చెబుతూ ఉంటారు. అలాంటి సిరి మరియు షన్నుల మద్య కాస్త వ్యవహారం ముదురుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల షన్నూకు సిరి ముద్దు పెట్టేసింది. సిరి పెట్టిన ముద్దుకు షన్నూ అలా చూస్తూ ఉండి పోయాడు. అరె ఎంట్రా ఇది అంటూ తనదైన శైలిలో డైలాగ్ కొట్టాడు. సిరి ముద్దు పెట్టిన విషయం సోషల్‌ మీడియాలో చాలా రచ్చ చేస్తోంది. ఈ విషయంలో సిరి ప్రియుడు శ్రీహాన్‌ స్పందించాలంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేశాడు. పాపం ఈ సమయంలో శ్రీహాన్ మరియు దీప్తి సునైనల పరిస్థితి ఏంటీ.. వారి ఆలోచనలు ఏంటీ అంటూ రకరకాలుగా కామెంట్స్ వస్తున్న సమయంలో శ్రీహాన్ స్పందించాడు.

ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో శ్రీహాన్ స్టోరీ పెట్టాడు. అందులో... ఇప్పుడేంట్రా నేను ఏడవాలా.. షార్ట్ ఫిల్మ్‌ ల్లో సినిమాల్లో చేస్తే ఓకే కదా మీకు అంటూ కౌంటర్ ఇచ్చాడు. సినిమాల్లో నటించే సమయంలో ముద్దు పెట్టుకుంటే పర్వాలేదు కాని షో లో ముద్దు పెట్టుకుంటే తప్పా అంటూ శ్రీహాన్ ఎదురు ప్రశ్నించడం మరింతగా చర్చనీయాంశం అయ్యింది. నటించే సమయంలో అలాంటివి పెద్దగా తప్పు లేదు. కాని ఇది రియాల్టీ షో.. ఇందులో నటించడం ఉండదు అనే విషయం నీకు తెలియదా శ్రీహాన్‌ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు అంటే బిగ్ బాస్ హౌస్ లో కూడా వీరిద్దరు కలిసి నటిస్తున్నారా అంటూ షన్నూ మరియు సిరిల ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ముద్దు విషయం సీరియస్ గా చర్చ అయితే జరుగుతోంది.