Begin typing your search above and press return to search.

ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే 'థ్యాంక్యూ' బ్లాక్ బ‌స్ట‌రే!

By:  Tupaki Desk   |   9 July 2022 6:35 AM GMT
ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే థ్యాంక్యూ బ్లాక్ బ‌స్ట‌రే!
X
'బంగార్రాజు' వంటి సూప‌ర్ హిట్ తో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించిన యువ‌సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య.. ఇప్పుడు 'థ్యాంక్యూ'తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు.

విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రాశి ఖ‌న్నా మెయిర్ హీరోయిన్ గా న‌టించ‌గా.. మాళవిక నాయర్, అవికాగోర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలాగే ఇందులో నాగ‌చైత‌న్య కాలేజీ స్టూడెంట్, హాకీ ప్లేయర్‌, బిజినెస్‌ మ్యాన్ మొత్తం మూడు డిఫ‌రెంట్ లుక్స్ లో అల‌రించ‌బోతున్నాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్స్‌ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ త‌మన్ స్వరాలు సమకూర్చాడు. బీవీఎస్ రవి కథను అందించారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను సైతం కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 8న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల మేక‌ర్స్ ఈ చిత్రాన్ని జూలై 22 కు పోస్ట్ పోన్ చేశారు.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ షురూ చేసి.. సినిమాకు సంబంధించి అప్డేట్స్ ను బ‌య‌ట‌కు వదులుతున్నారు. మ‌రోవైపు నాగ చైత‌న్య రాశి ఖ‌న్నాతో క‌లిసి వ‌రుస ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. 'థ్యాంక్యూ' సినిమా విష‌యంలో ఓ సెంటిమెంట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

అదేంటంటే, విక్ర‌మ్ కె కుమార్‌-నాగ చైత‌న్య‌-రాశి ఖ‌న్నా.. వీరిది హిట్ కాంబినేష‌న్‌. గ‌తంలో వీరు ముగ్గురు 'మ‌నం' మూవీ కోసం క‌లిసి వ‌ర్క్ చేశారు. 'మ‌నం'కు విక్ర‌మ్ కె కుమార్ దర్శ‌క‌త్వం వ‌హించ‌గా నాగ‌చైత‌న్య హీరోగా న‌టించాడు. అలాగే రాశి ఖ‌న్నా ఓ చిన్న పాత్ర‌ను పోషించింది. 2014లో విడుద‌లైన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ఈ మూవీ అనంత‌రం మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు విక్ర‌మ్ కె కుమార్‌-నాగ చైత‌న్య‌-రాశి ఖ‌న్నాలు క‌లిసి 'థ్యాంక్యూ' సినిమా కోసం ప‌ని చేశారు. ఈ నేప‌థ్యంలోనే 'మ‌నం' సెంటిమెంట్ గ‌నుక రిపీట్ అయితే 'థ్యాంక్యూ' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు మ‌రియు ప‌లువురు సినీ ప్రియులు భావిస్తున్నారు. మ‌రి 'థ్యాంక్యూ' రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే జూలై 22 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.