Begin typing your search above and press return to search.

వర్మ బాటలో రాజమౌళి వెళ్తే.. ఇక సంగతి అంతేనా..??

By:  Tupaki Desk   |   20 July 2020 10:31 AM GMT
వర్మ బాటలో రాజమౌళి వెళ్తే.. ఇక సంగతి అంతేనా..??
X
లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లన్ని మూతపడిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు నెలలు గడుస్తున్నా మహమ్మారి ప్రభావం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇక ఇళ్లకు పరిమితం అయిన జనాలకు ఓటీటీ ఫ్లాట్ ఫాములు మంచి వినోదం అందిస్తున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. ఆహా.. హాట్ స్టార్ వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫాములకు మంచి ఆధారణ పెరుగుతోంది. రోజురోజుకి ఓటీటీలలో విడుదల అవుతున్న తెలుగు సినిమాల జాబితా కూడా అలాగే పెరుగుతుంది. ఓ వైపు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సపరేట్ ఓటిటి ప్రారంభించి రచ్చ లేపుతున్నాడు. సినిమా బాగుంటే ఎక్కడైనా చూస్తారంటూ.. వర్మ తాజాగా ‘నగ్నం’ రిలీజ్ చేసాడు.

"భవిష్యత్ ఓటీటీదే. అసలు థియేటర్స్ అంటూ ఉండవ్.. అంతేకాదు తన సినిమాలకి థియేటర్లలో వచ్చే కలెక్షన్స్ కన్నా ఓటీటీలోనే ఎక్కువగా వస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే కేవలం 2గంటల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తోంది. రాజమౌళికి ఉన్న క్రేజ్ తో అది సాధ్యం అవుతుందని ఇదివరకే రచ్చలేపిన ఆర్జీవీ.. తాజాగా మరోసారి ట్విట్టర్లో రాజమౌళికి ఓటిటి విడుదల పై కొన్ని సలహాలు అందించాడు. ఆర్జీవీ త్వరలో పవర్‌ స్టార్ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయనున్నాడు. ఆ మూవీ ట్రైలర్ కే 25 రూపాయలు చెల్లించి చూడాలని.. ఈ నెల 22న రిలీజ్‌ చేయబోతున్నాడు. అయితే రాజమౌళిని ఉద్దేశించి.. " ప్రస్తుతం పవర్‌స్టార్‌ ట్రైలర్‌ 25రూపాయలు పెట్టి చూసేందుకు ఎంతోమంది ఆసక్తిగా ఉన్నారు. అదే ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ని రాజమౌళి రూ.150 లేదా రూ.200 పెట్టి అమ్మితే ఒక్క ట్రైలర్‌తోనే నిర్మాత పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది.

అప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా సినిమాను చూడొచ్చని ట్వీట్ చేసాడు. అంతేగాక ట్రైలర్‌ను చూపించి సినిమాను అమ్మడం అనేది పాత పద్ధతి. కానీ రాజమౌళి ట్రాక్ రికార్డును చూస్తే.. అతని మూవీ ట్రైలర్‌ని చూసేందుకే జనాలు ఎగబడతారు. రాజమౌళి ట్రైలర్ కూడా ఒక మూవీతో సమానం. అంతెందుకు రాజమౌళి 10 నిమిషాల షార్ట్‌ ఫిలిం తీసినా.. మల్టీఫ్లెక్స్ టికెట్‌ కొని మరీ చూడటానికి సిద్ధంగా ఉన్నారు. హే రాజమౌళి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌ వైపు చూస్తోంది. ఇప్పుడు అదే మార్కెట్‌. కొత్తగా ఆలోచించు. ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ను డబ్బులు పెట్టి కొని చూసేందుకు ఎదురుచూస్తున్నాం” అని వర్మ ట్వీట్లు చేసి షాక్ ఇస్తున్నాడు. ఇక రాజమౌళి వర్మ బాటలో ఆలోచిస్తే ఒక్కో ట్రైలర్ కూడా వందలు పెట్టి చూడాల్సి వస్తుందని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.