Begin typing your search above and press return to search.

రాజ‌మౌళిని కాద‌ని పైడిప‌ల్లికి ఓకే చెప్పాలంటే..?

By:  Tupaki Desk   |   5 April 2021 6:00 AM IST
రాజ‌మౌళిని కాద‌ని పైడిప‌ల్లికి ఓకే చెప్పాలంటే..?
X
స‌ర్కార్ వారి పాట త‌ర్వాత మ‌హేష్ న‌టించే సినిమా ఏది? అంటే దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. మ‌హ‌ర్షి ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లితో మ‌హేష్ కి క‌మిట్ మెంట్ ఉంది. ఆ త‌ర్వాత రాజ‌మౌళితోనూ సినిమా చేయాల్సి ఉంది. కానీ పైడిప‌ల్లి కంటే ముందే రాజ‌మౌళితో మ‌హేష్ సినిమా చేస్తారా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.

అయితే రాజ‌మౌళిని కాద‌ని పైడిప‌ల్లికి ఓకే చెప్పాలంటే అత‌డు స్క్రిప్ట్ తో మెప్పించాల్సి ఉంటుంది. స్క్రిప్టు ప‌రంగా మ‌హేష్ వంద‌శాతం సంతృప్తి చెందితేనే పైడిపల్లికి ఆఫ‌ర్ ఉంటుంది. అయితే పైడిప‌ల్లి ఈసారి ఎట్టి ప‌రిస్థితిలో మ‌హేష్ తో ప్రాజెక్ట్ ని ఖాయం చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట. ఇప్ప‌టికే స‌రికొత్త‌ లైన్ వినిపించి ఓకే చేయించుకున్న పైడిప‌ల్లి దానిని అభివృద్ధి చేసే ప‌నిలో ఉన్నారు. ఇంత‌కుముందు మ‌హ‌ర్షి ఆఫ‌ర్ కోసం రెండేళ్లు పైగా వేచి చూసిన పైడిప‌ల్లి ఇప్పుడు కూడా అంతే ప‌ట్టుద‌ల‌తో వేచి చూస్తున్నారు. మ‌హ‌ర్షి చిత్రంతో విజ‌యం అందుకుని ఇంత‌కాలం అత‌డు వెయిట్ చేయ‌డం అనేది ఇండ‌స్ట్రీలో అన్నివేళ‌లా చ‌ర్చ‌కు తెర తీస్తూనే ఉంది. ఇక రాజ‌మౌలిని కాద‌ని త‌న‌తోనే సినిమా చేయాలంటే కంటెంట్ ప‌రంగా కూడా పైడిప‌ల్లి ఆ రేంజులోనే థింక్ చేయాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుతానికి మ‌హేష్ తో సినిమా ఓకే అయ్యే ముందే పైడిప‌ల్లి ఓ వెబ్ సిరీస్ కి స‌న్నాహాలు చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఆహాలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఒక స్టార్ హీరోయిన్ న‌టించే ఈ సిరీస్ లో ఇత‌ర న‌టీన‌టుల ఎంపిక సాగుతోంది. ఇక ఇందులో న‌టించే స్టార్ హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉంది. మ‌హేష్ లాంటి హీరోతో సినిమా చేసే ముందు ఈ సిరీస్ తో నిరూపించుకుంటే అత‌డికి అది అద‌న‌పు అస్సెట్ అవుతుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. ప్ర‌తిభ ఉన్నా ప్ర‌తిసారీ ఛాలెంజ్ లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈసారి ఛాలెంజ్ లో అత‌డు స‌త్తా చాట‌తార‌నే ఆశిద్దాం.